ముఖ్యంగా దంతాలకు సమస్య మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది.

దంతాల్లోని నరాలు బ్యాక్టీరియా బారిన పడినప్పుడు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.

నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దంతవైద్యుడిని సంప్రదించడం అవసరం.

కొన్ని  చిట్కాలతో పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పంటి నొప్పిని తగ్గించడంలో  లవంగం నూనె చాలా బాగా పనిచేస్తుంది.

లవంగంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.

పత్తి దూదిపై కొన్నిచుక్కల లవంగాల నూనె వేసి నొప్పి ఉన్న పంటిపై రాయండి.

 ఇలా చేయడం వల్ల పంటి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

వెల్లుల్లి తినడం వల్ల పంటి నొప్పి కూడా తగ్గుతుంది.

నిమ్మకాయలు పంటి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆహారం తిన్న తర్వాత నిమ్మరసం తాగితే దంత క్షయాన్ని నివారిస్తుంది.

పియర్ ఆకుల్లో యాంటీమైక్రో బయల్ గుణాలు పుష్కలంగా  ఉన్నాయి.

పియర్ ఆకులను ఉడకబెట్టి దంతాలను శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించవచ్చు.

 ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పై సమాచారం అందించడం జరుగిరింది.