ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు రోజు ఒక గడ్డును ఆహారంలో తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు.

మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో రకాల పోషకాలు కోడి గుడ్డులో ఉంటాయి.  

ఆరోగ్యంగా ఉండాలని భావించి చాలా మంది ఆహారంలో రోజు ఒక గుడ్డు ఉండే విధంగా నియమాలు పాటిస్తున్నారు.

చాలా మంది మాత్రం కోడి గుడ్డును తమ ఇష్టం వచ్చినట్లు, ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటుంటారు. 

కోడి గుడ్డును ఈ రోజు ఉడకబెట్టి చాలా మంది రేపు తీసుకుంటుంటారు. 

అలా తీసుకోవడం లేని పోని అనారోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా లేకపోలేదని వైద్యులు సూచిస్తున్నారు. 

అసలు ఆహారంలో భాగంగా కోడి గుడ్డును ఎలా తినాలి? వైద్యులు ఎలాంటి సూచలను చేస్తున్నారనే పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం. 

కోడి గుడ్డును చాలా మంది ఎప్పుడంటే అప్పుడు తింటూ అనారోగ్యాలను కోని తెచ్చుకుంటున్నారు. 

ఈ రోజు ఉడకబెట్టి దాచుకుని రేపు తింటున్నారు. ఇలా తినడం ద్వారా గుడ్డులో లభించే నైట్రోజన్ క్యాన్సర్  కారక ప్రిరాడికల్స్ ను విడుదల చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కోడిగుడ్డును వండిన వెంటనే తినాలి. కోడుగుడ్డును మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినడం కూడా అంత మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఒక కోడి గుడ్డే కాకుండా ఎలాంటి ఆహార పదార్థాలైన మళ్లీ వేడి చేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. 

ఆహార పదార్థాలను ఇలా మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినడం ద్వారా లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ఇక నుంచైన కోడి గుడ్డును మళ్లీ మళ్లీ ఉడకబెట్టకుండా ఎప్పడిది అప్పుడే తినాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

ఎప్పుడు ఉడకబెట్టిన గుడ్డును అప్పుడే తినడం ద్వారా ఆరోగ్యం ఉండవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా తెలుపబడింది. అవగాహన కోసం వైద్యులను సంప్రదించవలసిందిగా మనవి.