సాధారణంగా కాలాన్ని బట్టి కొన్ని ఆహార పదార్థాలు తప్పనిసరిగా తినాలని చెబుతారు వైద్యనిపుణులు.

అయితే చాలా మందికి ఉండే అనుమానం.. చలికాలంలో తేనెను తినాలా? వద్దా? చలికాలం తేనెను తింటే ఆరోగ్యానికి మంచిదేనా? అని.

ఇక చలికాలంలో మనల్ని ప్రధానంగా వేధించే సమస్యలు గొంతు నొప్పి, దగ్గు, శ్వాసకోశ వ్యాధులు.

ఈ సమస్యలన్నింటికీ తేనె అద్భుత ఔషధంగా పనిచేస్తుందంటున్నారు వైద్యనిపుణులు.

చలికాలంలోనే కాదు ఏ కాలంలోనైనా తేనెను తగినంతగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. 

ఇక తేనెను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఏమేం లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తేనెలో ఉండే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ లాంటి ఖనిజాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల నుంచి బాడీని రక్షిస్తాయి. 

వాటి వల్ల టైప్ 2 డైయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

దాంతో పాటుగా తేనె డయాబెటీస్ కు, వృద్ధాప్యానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని పలు అధ్యాయనాల్లో తేలింది.

ఇక చలికాలంలో చాలా మంది గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు.

అలాంటి వారు గొరు వెచ్చిని నిమ్మకాయ నీటిలో తేనెను కలిసి తీసుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్: పైన తెలిపిన సూచనలు, సలహాలు పాటించే ముందు దగ్గర్లో ఉన్న వైద్యులను సంప్రదించండి.