నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు. దీంతో అందరూ నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు.

అయితే చాలా మందికి రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగడం మంచిదేనా అనే అనుమానం కలుగుతుంది.

అసలు రాత్రి తిని పడుకునే ముందు నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

నీళ్లు తాగడం శరీరానికి చాలా ముఖ్యం. రోజుకి 4 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తాగాలని వైద్యులు సచిస్తున్నారు.

నీళ్లు తాగడం ద్వారా శరీరం డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కానీ, నీళ్లు ఎప్పుడు పడితే అప్పుడు తాగడం కూడా అంత మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు.

మరీ ముఖ్యంగా కొంతమంది రాత్రి తిని పడుకునే ముందు నీళ్లు తాగి పడుకుంటుంటారు. అలా చేయడం ప్రమాదమంటున్నారు నిపుణులు.

అలా కాకుండా రాత్రి పడుకునే 40 నిమిషాలు ముందు నీళ్లు తాగి ఆ తర్వాత నిద్రపోవాలని నిఫుణులు సూచిస్తున్నారు.

అయితే హార్ట్ పేషెంట్స్, డయాబెటీస్ పేషెంట్స్ మాత్రం రాత్రిపూట నీళ్లు తక్కువగా తాగాలట.

ఎందుకంటే ఎక్కువగా మూత్రానికి లేవడంతో వారి నిద్రకు భంగం వాటిల్లుతుంది.

అలాగే భోజనం చేసే కంటే 30 నిమిషాల ముందు, భోజనం తర్వాత 40 నిమిషాల తర్వాత నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.