మాములుగా చాలా మంది గుడ్డులో ఉండే పచ్చ సోన తినేందుకు ఇష్టపడరు.

 కొందరు వైట్ తో పాటు ఆ పచ్చ సోనని కలిపి తింటుంటే మరింకొందరు మాత్రం పచ్చ సోనను తీసేసి మిగతాది తినేస్తుంటారు.

గుడ్డులోని పచ్చ సోన తినడం వల్ల ప్రమాదమని కూడా చెడుతున్నారు.

నిజంగానే గుడ్డులోని పచ్చసోన తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

గుడ్డులో ఉండే పచ్చ సోనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. పైగా HDL  కొలస్ట్రాల్ ఉండడం విషేషం.

శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గి గుండె సంబంధిత రోగాలు రాకుండా ఈ HDL కొలస్ట్రాల్  సహాయపడుతుంది.

గుడ్డులోని సోన తింటే స్ట్రోక్ రాకుండా దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గుడ్డులోని పచ్చని సోనలో కాల్షియంతో పాటు పాస్పరస్ ఉంటుంది. ఇవి ఎముకల ఎదుగుదలకు సహాయపడతాయి

అంతే కాకుండా పచ్చని సోనలో పాస్ఫోలైఫిడ్స్ ఉంటాయి. ఇది కణాల ఆరోగ్యానికి దోహదపడతాయి.

దీంతో పాటు బాక్టీరియా, ఫంగస్ దాడి చేసినప్పుడు ఇమ్మినోగ్లిబిలిన్స్ తోడ్పాటును అందిస్తాయి.

వైట్ తో పాటు అందులోని పచ్చని సోనను తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక నుంచైనా పచ్చ సోనని పడేయకుండా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE: ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించండి