భారతదేశంలో ఎన్నో సనాతన సంప్రదాయ శాస్త్రాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఆయుర్వేదం.
ఇక ఈ ఆయుర్వేదంలో దగ్గు నుంచి క్యాన్సర్ వరకు నయంచేసే ఔషధాల గురించి మన పూర్వికులు వివరించారు.
కరెక్ట్ గా వాడితే ప్రతి చెట్టు, ప్రతీ ఆకు ఓ ఔషధంగానే పనిచేస్తుందని వారు ఈ శాస్త్రంలో చెప్పారు.
అయితే పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో ప్రధానంగా వినిపిస్తున్న, వినియోగిస్తున్న ఆకు తమలపాకు. చాలా మంది దీనిని అన్నం తిన్న తర్వాత తీసుకుంటారు.
అయితే చాల మందిలో ఉన్న అపోహ ఏంటంటే? తమలపాకును తినడం మంచిదా? కాదా? అని.
ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం తమలపాకును పరగడుపున తింటే ఎంతో మంచిదట. ఇప్పుడు తమలపాకు తినడం వల్ల లాభాల గురించి తెలుసుకుందాం.
తమలపాకులో విటమిన్ సి, థయామిన్, రైబోప్లావిన్, కెరోటిన్, కాల్షియం లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
ఇక తమలపాకులను పరగడుపునే ఖాళీ కడుపుతో తీసుకుంటే.. జీర్ణక్రీయ మెరుగుపడుతుందంటున్నారు వైద్యులు.
అదీ కాక ఇలా తినడం మూలంగా శరీరానికి ఇన్ఫెక్షన్ బారినుంచి తప్పించుకునే శక్తి వస్తుంది.
వ్యాధి సోకిన ప్రదేశంలో తమలపాకుల పేస్టు రాస్తే.. ఇన్ఫెక్షన్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
తమలపాకులకు కీళ్ల నొప్పులు నయం చేసే గుణం ఎక్కువ. ఈ ఆకుల్లో ఉండే కాల్షియం, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను, వాపులను తగ్గిస్తుంది.
అందుకే పరగడుపునే తమలపాకులను తీసుకోవాలంటారు వైద్య నిపుణులు.
ప్రతిరోజూ ఉదయాన్నే తమలపాకులు తినడం ద్వారా నోటిలో వచ్చే చిగుళ్ల వాపును నివారించవచ్చు.
అలాగే నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. పంటి నొప్పిని తగ్గించడంలో తమలపాకులు బాగా సహాయపడతాయి.
నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లోని వైద్యులను సంప్రదించగలరు.