చూయింగ్ గమ్ మనందరికీ చిరుతిండి. ఎంతసేపు అయినా నములుకోవచ్చు అని తెగ తిని ఉంటారు కదా!
పొరపాటున చూయింగ్ గమ్ మింగేస్తే పేగులకు చుట్టుకుపోతుందని భయపడిపోతుంటాం.
అందుకే నమిలినంత సేపు బాగా నమిలేసి, చూయింగ్ గమ్ ని ఊసేస్తుంటాం.
ఇకపోతే చూయింగ్ గమ్ తినే విషయమై పలు పరిశోధనలు చేసిన ఆరోగ్య నిపుణులు ఆసక్తికర విషయాల్ని రివీల్ చేశారు.
షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ నమలడం వల్ల గంటకు 11 కేలరీలు ఖర్చవుతాయట.
వర్కౌట్ చేస్తూ చూయింగ్ గమ్ నమిలితే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి.
40 ఏళ్లు దాటిన వారి చూయింగ్ గమ్ నమలడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది.
చూయింగ్ గమ్ మింగేస్తే పేగులకు చుట్టుకుపోతుందని చాలామంది భయపడుతుంటారు. అది నిజం కాదు.
మన శరీరం దీన్ని జీర్ణించుకోలేదని, దాన్ని మింగడం వల్ల పేగులకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చూయింగ్ గమ్ ని నమిలి, బయటకు ఊసేయకపోతే మాత్రం పేగుల్లో ఆటంకాలు సృష్టిస్తుందని అంటున్నారు.
చక్కెరతో చేసే చూయింగ్ గమ్స్ వల్ల దంతాలకు హాని కలిగిస్తుందని, చిగుళ్ల సమస్య ఏర్పడుతుంది.
షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ వల్ల దంతాల శుభ్రం కావడంతో పాటు దవడల వ్యాయామం అవుతుంది.
చూయింగ్ గమ్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కడుపుబ్బరం సమస్య వచ్చ ప్రమాదముంది.
ఇక చూయింగ్ గమ్ తినాలా వద్దా.. తింటే ఎంత వరకూ తినాలి అనేది మీ ఇష్టం.