ఈ రోజుల్లో చిన్న వయసు వారు కూడా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. రక్తపోటు పెరగడానికి కారణాలెన్నో ఉంటాయి.

ఏదేమైనా దీన్ని అదుపు చేయకుంటే గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు దీర్థకాలం ఉండే అనారోగ్య సమస్య.

ఇది మన గుండెని ఒత్తిడికి గురిచేస్తుంది. అంతేకాదు గుండె సంబంధిత రోగాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

సాధారణంగా మనం చేసే పనుల బట్టి ఈ రక్తపోటులో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. అయినప్పటికీ సాధారణం కంటే మరీ ఎక్కువగా ఉంటే మీరు అధిక రక్తపోటు బారిన పడ్డారని అర్థం చేసుకోవాలి.

మాయో క్లినిక్ ప్రకారం.. ఎలివేటెడ్ రక్తపోటును సిస్టోలిక్ పీడనం 120 నుంచి 129, డయాస్టొలిక్ పీడనం 80 కంటే తక్కువ నిర్వచించారు. సాధారణ రక్తపోటు 120/80 మిమీ hd లేదా అంతకంటే తక్కువ.

రక్తపోటు 180/120 మిమీ hd కంటె ఎక్కువ రక్తపోటు ఉంటే ప్రమాదకరం. ఇది మీ ప్రాణాలను తీస్తుంది.

మన శరీరానికి పొటాషియం అనే ఖనిజం చాలా చాలా అవసరం. ఇది మన కణాల లోపలి ద్రవం సాధారణ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.

హెల్త్ హార్వర్డ్ పరిశోధనల ప్రకారం.. ఇది హార్ట్ బీట్ ను నియంత్రిస్తుంది. కండరాలు, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రోటీన్ సంశ్లేషణకు, కార్భోహైడ్రేట్లను జీవక్రియ చేయడానికి ఇది చాలా ముఖ్యం.

పొటాషియం మన రక్తనాళాల గోడలను సడలిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే కండరాల తిమ్మిరి నుంచి కాపాడుతుంది.

మలబద్దకం, గుండె దడ లేదా గుండె కొట్టుకోడం ఆపేసినట్టు, అలసట, కండరాల నష్టం, కండరాల బలహీనత, తిమ్మిరి లాంటి పొటాషియం లోపానికి సంకేతాలు.

మలబద్దకం, గుండె దడ లేదా గుండె కొట్టుకోడం ఆపేసినట్టు, అలసట, కండరాల నష్టం, కండరాల బలహీనత, తిమ్మిరి లాంటి పొటాషియం లోపానికి సంకేతాలు.

మీలో పై లక్షణాలను గుర్తించినట్లయితే వెంటనే హాస్పిటల్ కు వెళ్లడం మంచిది. రక్తపరీక్ష చేసుకుంటే మీలో పొటాషియం స్థాయిలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాధారణంగా పొటాషియం స్థాయి 3.5 నుంచి 5.2 వరకు ఉంటుంది. 

అయితే పొటాషియం స్థాయిలు 3, 3.5 mEq/L ఉంటే మీరు హైపోకలేమియా బారిన పడ్డారని అర్థం. 

మాయో క్లినిక్ ప్రకారం.. శరీరంలో పొటాషియం లోపించడం చాలా అరుదు. పెద్దలకు రోజుకు 1600 నుంచి 2000 మి.గ్రా పొటాషియం సరిపోతుంది.

ఆకు కూరలు, పాలు, పాల ఉత్పత్తులు, బీన్స్, కాయలు, ట్యూనా, కాడ్, ట్రౌట్ వంటి చేపలు, చలికాలపు స్క్వాష్ వంటి పండిన కూరగాయల్లో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది.

నారింజ, అరటి పండ్లు, నేరేడు పండ్లు, కాంటాలౌప్, ద్రాక్షపండు వంటి ఫ్రూట్స్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

కిడ్నీ బీన్స్, కాయధాన్యాలు, సోయాబీన్స్, లిమా బీన్స్ తో సహా అన్ని రకాల బీన్స్, చిక్కుళ్లలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది.

నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.