వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది విహారయాత్రలకు వెళ్లడానికి రెడీ అవుతారు.
కొందరు స్థానికంగా ఉండే పర్యాటక ప్రదేశాలను చుట్టి వస్తే.. మరి కొందరు విదేశాలకు వెళ్తారు.
మన దగ్గర విహారయాత్రలు అంటే ఓకే.. కానీ విదేశాలకు వెళ్లే వారు.. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
అక్కడ బస, ఆహారం, గైడ్ వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొవాలి. మరీ ముఖ్యంగా భోజనానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఇలాంటి ఇబ్బందులు తప్పించి.. సంతోషంగా ట్రిప్ ఎంజాయ్ చేసి రావడం కోసం ఇండియన్ రైల్వేస్‌కు చెందిన టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ మంచి ఆఫర్లను తీసుకొచ్చింది.
బడ్జెట్ ధరలోనే ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది.
ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే.. హోటల్ బుకింగ్, ప్రయాణం, దర్శనీయ స్థలాలు, గైడ్ ఇలా దేని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
ఇక తాజాగా ఐఆర్‌సీటీసీ థాయ్‌లాండ్ వెళ్లేవారికి బంపరాఫర్ ప్రకటించింది.
ఒక్కరికి కేవలం 52 వేల రూపాయల ఖర్చుతో.. థాయ్‌లాండ్‌లో 6 రోజులు ఉండవచ్చు.
ఈ టూర్‌లో మొత్తం 5 రాత్రుళ్లు, 6 పగళ్లు థాయ్‌లాండ్‌లో గడపవచ్చు.
మొదటి ట్రిప్ ఏప్రిల్ 25 న బిహార్‌లోని పట్నా ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రారంభం అవుతుంది.
ఆ తర్వాత వెళ్లాలనుకునేవారికి మళ్లీ మే 26న కోల్‌కతా నుంచి ప్యాకేజ్ అందుబాటులో ఉంది.
చిన్న చిన్న మార్పులు మినహా.. ఈ రెండు ప్యాకేజ్‌లు దాదాపు ఒకేలా ఉన్నాయి.
ఈ ప్యాకేజ్‌లో భాగంగా థాయ్‌ల్యాండ్‌లో ఫేవరేట్ టూరిస్ట్ స్పాట్స్ కోరల్ ద్వీపం, పట్టాయ, బ్యాంకాక్ వంటి ప్రదేశాలను చూడొచ్చు.
ఇక ప్యాకేజీలో భాగంగా.. ఉదయం టిఫిన్, రాత్రి భోజనం అందుబాటులో ఉంటాయి.