తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నిత్యం వేలాది మంది భక్తులు  శ్రీవారిని దర్శించుకునేందుకు  తిరుమలకు వస్తుంటారు.

తిరుమలకు వెళ్లే ప్రయాణికులు రవాణ సంస్థలు తరచూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.

 తాజాగా ఈ సమ్మర్ కు తిరుపతికి వెళ్లాలనుకునే వారికి రైల్వేశాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

తక్కువ ధరకే తిరుమల తిరుపతికి చేరేలా గోవిందం టూర్ ను ప్రకటించింది.  

 'గోవిందం' టూర్ రెండు రాత్రులతో మూడు రోజుల పాటు కొనసాగనుంది.

తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ టూర్ ఉపయోగపడుతుంది.

ఈ ప్రత్యేక ప్యాకేజీతో తిరుమల శ్రీవారితో పాటు తిరుచానూరు కూడా దర్శించుకోవచ్చు.

 గోవిందం టూర్ లో తొలిరోజు  12734 నెంబర్ రైలు లింగపల్లిలో సాయంత్రం 5.25 బయలుదేరుతుంది.

 మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.

 అదే  రోజు సాయంత్రం  6.25 గంటలకు 12733 నెంబర్ తిరుపతి నుంచి సికింద్రబాద్ కు బయలు దేరుతుంది.

మూడో రోజు ఉదయం 7 గంటలకు  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.

 స్టాండర్డ్ ప్యాకేజీ ధరలు: సింగిల్ షేరింగ్ ధర రూ.4,950, డబుల్ షేరింగ్ ధర రూ.3,800, ట్రిపుల్ షేరింగ్ ధర రూ.3,800

కంఫర్ట్ ప్యాకేజీ ధరలు: సింగిల్ షేరింగ్ ధర రూ.6,790, డబుల్ షేరింగ్ ధర రూ.5,660

స్టాండర్డ్ ప్యాకేజీని ఎంచుకున్నవారు స్లీపర్ క్లాస్ లో, కంఫర్ట్ ప్యాకేజీ వాళ్లు థర్డ్ ఏసీలో ప్రయాణం ఉండనుంది.