ఐఫోన్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కొందరికి అయితే ఐఫోన్‌ కొనాలి, వాడాలి అనేది ఒక డ్రీమ్‌ కూడా.

ఇటీవలే ఐఫోన్‌ 14ని మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసి ఫుల్‌ జోష్‌ మీదుంది. 

అయితే ఇప్పటివరకు ఐఫోన్‌ గరిష్ట ధర అంటే రూ.లక్ష, లక్షన్నర, మోడల్‌ని బట్టి రూ.2 లక్షల వరకు కూడా ఉండి ఉండొచ్చు.

కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఐఫోన్‌ ధర ఏకంగా రూ.28 లక్షలు. అయితే అది కంపెనీ వాళ్లు నిర్ణయించిన ధర కాదులెండి. వేలంలో ఓ ఐఫోన్‌ అక్షరాలా రూ.28 లక్షలకు పైగా ధర పలికింది.

అయితే అందులో అంత గొప్ప ఏముంది? ఎందుకు ఆ ఐఫోన్‌ అంత ధర పరిలికింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌ చదవాల్సిందే.

2007లో యాపిల్‌ ఐఫోన్‌ తమ తొలితరం ఫోన్లను విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఫోన్లకు మార్కెట్‌లో ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు.

ఇటీవలే ఐఫోన్‌ 14 విడుదల సమయంలో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మోడల్‌ని రిలీజ్‌ చేసిన నిమిషాల్లో హాట్‌ కేకుల్లా ఫోన్లన్నీ అమ్ముడుపోయాయి.

అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఫోన్‌ అంతకు మించిన రికార్డును సృష్టించింది. ఏకంగా వేలంలో రూ.28 లక్షల ధరకు అమ్ముడయ్యి.. అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎల్‌సీజీ ఆక్షన్స్‌ వారు నిర్వహించిన వేలంలో ఈ రికార్డు ధర పలికింది. నిజానికి ఈ ఫోన్‌కు ప్రారంభ ధర కేవలం 2,500 డాలర్లు మాత్రమే పెట్టారు.

అయితే రెండ్రోజుల తర్వాత 10 వేల డాలర్లకు చేరుకుంది. చివరికి 39,339 డాలర్లకు అమ్ముడైంది.

39,339 డాలర్లు అంటే.. మన కరెన్సీలో దాదాపుగా రూ.28 లక్షలు అనమాట. అయితే ఇప్పుడు ఐఫోన్‌ ప్రియులే కాదు..

నెట్టింటి ఈ వార్త చూసినవారంతా అంత ధర ఎందుకు పలికింది? ఎందుకు అంత ప్రత్యేకం అని వెతుకులాట మొదలు పెట్టారు.

అయితే ఈ ఐఫోన్‌ ఇప్పటిది కాదు. 2007లో యాపిల్‌ తమ సేవలను ప్రారంభించిన సమయం నాటింది.

అంటే 15 ఏళ్ల క్రితం ఐఫోన్‌ అనమాట. ఈ ఫస్ట్ జనరేషన్‌ ఐఫోన్‌ వేలంలో రూ.28 లక్షలు పలికింది. అయితే 15 ఏళ్ల క్రితం ఐఫోన్‌కి అంత ఎందుకు పెడతారనే అనుమానం మీకూ వచ్చిందా? అవును అయితే ఆ ఐఫోన్‌ సీల్డ్‌ ప్యాకింగ్‌లో ఉంది.

కంపెనీ నుంచి వచ్చిన ప్యాకింగ్‌ ఓపెన్‌ కూడా చేయకుండా ఉందనమాట. అంటే 15 ఏళ్ల క్రితం విడుదలైన ఫస్ట్ జనరేషన్‌ న్యూ ఫోన్‌ అనమాట.

అందుకే టెక్‌ ప్రియులు అంత పోటీ మరీ 15 ఏళ్ల క్రితంనాటి ఓపెన్‌ చేయని ఐఫోన్‌ కోసం అంత పోటీ పడ్డారు.