టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన ఐఫోన్ 14  సిరీస్ మన దేశంలో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.

భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి జరిగిన  ఈవెంట్ లో ఐఫోన్ కొత్త వర్షన్స్ కి సంబంధించిన పలు  మోడల్స్ ని ఆవిష్కరించింది.

ఐఫోన్ 14లో తొలిసారి శాటిలైట్ కనెక్టివిటీ టెక్నాలజీని  ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ తో మీరు మొబైల్ నెట్వర్క్  పరిధిలో లేకున్నా కాల్స్ చేసుకునే వీలుంటుంది.

అసలు శాటిలైట్ కనెక్టివిటీ ఏమిటీ? అది ఎలా పని  చేస్తుంది? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎలాంటి సెల్‌ఫోన్ టవర్స్ సిగ్నల్స్ లేని ప్రాంతాలను డెడ్  జోన్స్‌‌ అని పిలుస్తుంటారు. సాధారణంగా మొబైల్ లో  సిగ్నల్ లేనప్పుడు కాల్ చేయడం కుదరదు.

ఇది అందరకి తెలిసిన విషయమే. కాకంటే.. శాటిలైట్  కనెక్టివిటీ టెక్నాలజీని మొబైల్ లో ఇన్ బిల్ట్ చేసినపుడు..  మనం సిగ్నల్స్ లేని ప్రాంతంలో ఉన్నప్పుడు.

ఆ టెక్నాలజీ సహాయంతో మనం కాల్స్, మెసేజ్‌లు  చేసుకోవచ్చు. అందుకోసం.. మొబైల్ తయారీ సంస్థ, సదరు  శాటిలైట్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకోవాల్సి  ఉంటుంది.

అలాంటి అధునాతన టెక్నాలజీని ' ఐఫోన్ 14 సిరీస్ లో ప్రవేశపెట్టారు.

అత్యవసర సమయాల్లో మొబైల్‌ నెట్‌వర్క్‌, వైఫై  అందుబాటులో లేనప్పుడు ఈ శాటిలైట్‌ SOS  సదుపాయాన్ని మనం వినియోగించుకోవచ్చు.

ఇందులో “ఎమర్జెన్సీ ఏమిటి?”, “ఎవరికి సహాయం  కావాలి?”, మరియు “ఎవరైనా గాయపడ్డారా?”  వంటి ప్రశ్నలు ఉంటాయి.

ఇందులో “ఎమర్జెన్సీ ఏమిటి?”, “ఎవరికి సహాయం  కావాలి?”, మరియు “ఎవరైనా గాయపడ్డారా?”  వంటి ప్రశ్నలు ఉంటాయి.

సమాధానాలను డిస్క్రిప్షన్ ఫార్మాట్ లో కూడా  ఇవ్వొచ్చు. ఈ వివరాలతో కూడిన టెక్స్ట్  సందేశాన్ని మీ అత్యవసర పరిచయాలకు  పంపుతుంది.

అందుకోసం.. సెల్యులార్ నెట్‌వర్క్‌లతో పోలిస్తే  బ్యాండ్‌విడ్త్ తక్కువగా ఉన్నందున, కమ్యూనికేషన్‌ను  వేగవంతం చేయడానికి టెక్స్ట్ సందేశాలను  చిన్నదిగా చేసే కంప్రెషన్ అల్గారిథమ్‌ను  యాపిల్ సంస్థ రూపొందించింది.

ఈ సర్వీస్ నవంబరు నుంచి తొలుత యూఎస్‌,  కెనడాలో ను అందుబాటులోకి రానుంది. ఇదెలా  పని చేస్తుందో మీరు క్రింది వీడియోలో చూడొచ్చు.