పిల్లల భవిష్యత్తు కోసమనో, ఇంటి కోసమనో, ఇతర అవసరాల కోసమనో చాలా మంది లక్షల్లో చిట్టీలు వేస్తుంటారు.

నమ్మకంగా ఉన్న వ్యక్తి దగ్గర చిట్టీలు వేసి.. నెలకు ఇంత అని కడుతుంటారు.

చిట్టీలు కట్టే కొందరు ఆఖరు వరకూ ఉండి కడతారు. కానీ చిట్టీలు కట్టించుకున్నవారు ఉంటారన్న గ్యారంటీ లేదు.

ఇటీవల కాలంలో చిట్టీలు కట్టించుకుని ఊరొదిలి పారిపోయారన్న వార్తలు అనేకం వచ్చాయి.

ఇలాంటి పరిస్థితుల్లో డబ్బుకు గ్యారంటీ లేదు. మరి దాచుకోవడం ఎలా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.

మీ డబ్బు పోతుందన్న భయం లేకుండా ధైర్యంగా పెట్టుబడి పెట్టుకునే మార్గం ఒకటి ఉంది. అదే మ్యూచువల్ ఫండ్స్.

ఈ మ్యూచువల్ ఫండ్స్ లో చిన్న మొత్తాల పెట్టుబడితో దాదాపు రూ. 3 కోట్లు వరకూ పొదుపు చేసుకోవచ్చు.

సుదీర్ఘ కాలం తర్వాత మీరు పెట్టే చిన్న పెట్టుబడికి అత్యధిక రాబడులు రావాలనుకుంటే గనుక మ్యూచువల్ ఫండ్స్ ని ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

30 ఏళ్ళు ఓపిగ్గా పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే.. మెచ్యూరిటీ సమయానికి రూ. 3 కోట్లు పొందే అవకాశం ఉంటుంది.

మొదట్లో నెల నెలా రూ. 10 చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్ళాలి.

ఆదాయం పెరిగినప్పుడల్లా మీ పెట్టుబడిని పెంచుకుంటూ ఉండాలి.

ఇలా 30 ఏళ్ల పాటు ఇలా చేస్తే మీ చేతికి రూ. 3 కోట్లు వస్తాయని చెబుతున్నారు.

అయితే పెట్టుబడి పెట్టే ముందు క్షుణ్ణంగా అధ్యయనం చేసి దిగాలి.

మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ ఉంటుంది. కానీ తక్కువ.