మీరు మీ గోల్ గురించి ఇతరులకు చెబితే విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట.
ఎందుకంటే.. మోటివేషన్ తగ్గిపోతుందని నివేదికలు చెబుతున్నాయి.
మీరు నిద్రలోకి జారుకునే ముందు ఎవరైతే చివరి సారిగా మీకు గుర్తుకు వస్తారో.. వాళ్లు మీ సంతోషానికైనా లేదా బాధకైనా కారణం అయి ఉంటారు.
మనం వినే పాటలే ప్రపంచం పట్ల మన దృష్టి కోణాన్ని మారుస్తాయట.
మనం సరిగా నిద్రపోయామని మనల్ని మనం ఒప్పించగలిగితే.. మెదడు కూడా దాన్ని నిజం అని నమ్ముతుందట.
సాధారణంగా డబ్బుతో సంతోషాన్ని కొనుక్కోలేము అంటూ ఉంటారు. కానీ, 49 లక్షలు పైబడి సంపాదిస్తున్న వారి జీవితాల్లో సంతోషం కొద్దిగా ఎక్కువగా ఉన్నదట.
ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్లు.. మనల్ని కూడా సంతోషంగా ఉంచుతారట.
మనసు విరగటం వల్ల కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. దాన్నే స్ట్రెస్ కార్డియోమైయోపతి అంటారు.
90 శాతం మంది తాము మాటల్లో చెప్పలేని వాటినే రాతల రూపంలో ఎదుటి వ్యక్తికి చెబుతున్నారట.
తెలివైన వాళ్లే తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారట.
ఎందుకూ పనికి రాని వాళ్లు తమను తాము తెలివైన వాళ్లలా అనుకుంటూ ఉంటారట.