దసరా వచ్చింది. సరదాలు తెచ్చింది. భక్తులు దసరా సందర్భంగా దేవీ నవరాత్రులు జరుపుతారు.

ఈ తొమ్మిది రోజులూ అమ్మవారిని ఒక్కో రోజూ ఒక్కో రూపంలో పూజిస్తారు.

అంతేకాదు ఒక్కో రంగు దుస్తుల్లో అమ్మవారిని అలంకరిస్తారు.

ఇలా అమ్మవారిని ఒక్కో రంగులో అలంకరించడం వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

నారింజ రంగు వర్ణంతో దేవీ నవరాత్రులు మొదలవుతాయి. శక్తికి, ఉత్సాహానికి ప్రతీక ఈ నారింజ రంగు. అందుకే అమ్మ వారిని ఈ నారింజ రంగు దుస్తుల్లో అలంకరిస్తారు.

కాళరాత్రి అవతారమైన దుర్గామాతను తెలుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. దుష్టులను అంతం చేసే అవతారంలో అమ్మవారు భయంకరంగా ఉంటారు. 

శాంతింపజేసేందుకు తెల్లని వస్త్రాలతో అలంకరిస్తారు. శాంతికి, ప్రార్థనకు ప్రతీక ఈ తెలుపు రంగు.

మొదటిరోజు దుర్గామాతను ఎరుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. ఈ రంగు ధైర్యానికి, శక్తికి, ప్రేమకి ప్రతీక. అందుకే ఎక్కువ మంది ఎర్రని వస్త్రాలను ధరించి అమ్మ వారిని పూజిస్తారు. 

రాజ నీలం (రాయల్ బ్లూ): ఈ రంగు అధికారానికి, నమ్మకానికి, ఆత్మ విశ్వాసానికి ప్రతీక. అమ్మవారిని రాయల్ బ్లూ రంగు దుస్తుల్లో అలంకరిస్తారు. ఆలయాన్ని కూడా ఈ రంగు పూలతో అలంకరిస్తారు. 

నవరాత్రులప్పుడు అమ్మవారిని పసుపు రంగు చీరలో అలంకరిస్తారు. దీనికి కారణం అమ్మవారిలో ఉన్న ధైర్యం, తెగువే. ధైర్యానికి సంకేతంగా ఈ పసుపు రంగు దుస్తుల్లో అలంకరిస్తారు.

ఆ తల్లి అనుగ్రహంతోనే ఈ భూమి పచ్చని చెట్లు, అడవులతో అందంగా ఉందని భక్తులు విశ్వసిస్తారు. అమ్మ వారే ఈ పచ్చని లోకాన్ని సృష్టించిందని నమ్ముతారు. 

అందుకు ప్రతీకగా అమ్మవారిని ఆకుపచ్చ రంగు దుస్తులతో అలంకరిస్తారు.  

నిశ్చలమైన స్వభావానికి, ప్రశాంతతకు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా సరైన నిర్ణయం తీసుకునే స్వభావానికి సంకేతంగా బూడిద రంగు దుస్తులతో అమ్మవారిని అలంకరిస్తారు.  

దయ, ప్రేమ, సామరస్యం, ఆప్యాయత, అనురాగాలకి ప్రతీకగా గులాబీ రంగు సూచిస్తుంది. అందుకే అమ్మవారిని గులాబీ రంగు దుస్తుల్లో అలంకరిస్తారు.    

కరుణ, ప్రశాంతత, మనిషి యొక్క వ్యక్తిత్వం వంటి వాటికి ప్రతీక ఈ నెమలి ఆకుపచ్చ రంగు. ఈ గుణాలకి సంకేతంగా అమ్మవారు వారు నెమలి ఆకుపచ్చ వర్ణంలో దర్శనమిస్తారు