కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇకలేరు అనే వార్తను సినిమా ఇండస్ట్రీ, అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

కన్నడలో డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ ఏదైనా అప్పు తర్వాతే అనడం అతిశయోక్తి కాదు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం పునీత్ సొంతం. ‘అప్పు’ అనే సినిమాతో కన్నడలో పునీత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

తన డెబ్యూ సినిమాలో కన్నడ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించాడు.

తొలి చిత్రంతోనే స్టార్ హీరో బ్రాండ్ను సొంతం చేసుకున్నాడు పునీత్ రాజ్ కుమార్.

 పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని అనుబంధం, గౌరవం ఉన్నాయి.

తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ ఎలాగో.. కన్నడలో కంఠీరవ పునీత్ రాజ్ కుమార్ అలాంటి వ్యక్తి.

ఆయన తలుచుకుంటే కన్నడలోనే టాప్ డైరెక్టర్లతో తన కుమారుడు పునీత్ను హీరోగా పరిచయం చేసి ఉండచ్చు.

కానీ, పూరి జగన్నాథ్తో పునీత్ను హీరోగా పరిచయం చేశారు.

అందుకు పూరీ తీసిన బద్రి సినిమానే కారణం. 2000సంవత్సరంలో పూరీ తీసిన బద్రీ సినిమా చూసి కంఠీవ రాజ్ కుమార్ పునీత్ను పూరీ డైరెక్షన్లోనే పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారు.

 2002లో పూరీ డైరెక్షన్లో ‘అప్పు’ సినిమాను తీశారు.

కన్నడలో అది రికార్డులు సృష్టించింది. తన డెబ్యూ చిత్రం పేరే అతని బిరుదుగా, నిక్ నేమ్గా మారిపోయింది.

మళ్లీ అదే సినిమాను తెలుగులో రవితేజతో ‘ఇడియట్’ అని తీశాడు పూరీ జగన్నాథ్.

పునీత్ రాజ్ కుమార్ అంటే కన్నడలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అంత పెద్ద స్టార్ ఎదిగిన తర్వాత కూడా పునీత్ ఎంతో హుందాగా, చాలా సింపుల్గా ఉంటాడు.

తనను హీరోగా పరిచయం చేసిన పూరీ జగన్నాథ్ అంటే పునీత్ ఎంతో అభిమానం. ఇంతగా ఎదిగిన తర్వాత కూడా పూరీని గురువుగానే చూసేవాడు.