భారత రాష్ట్రపతి 2020 సంవత్సరానికి గానూ పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు.

వారిలో అందరినీ ఆశ్చర్యపరిచినది.. అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి తులసి గౌడ(76).

ఆవిడకు అక్షరం ముక్కరాదు. కానీ, అడవిలోని చెట్ల గురించి గుక్కతిప్పుకోకుండా మాట్లాడగలదు.

అందుకే ఆమెకు ‘ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్’ అనే పేరు కూడా వచ్చింది.

ఏ మొక్క ఎందుకు ఉపయోగపడుతుంది. ఆ మొక్క జీవితకాలం ఎంత? దానికి ఏ రకం ఎరువులు ఉపయోగిస్తే బాగా పెరుగుతుంది.. వంటి విషయాలను ఇట్టే చెప్పేస్తుంది.

ఈవిడ కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని ఓ గ్రామంలో జన్మించారు. ఆవిడది హలక్కీ గిరిజన కుటుంబం.

 పర్యావరణ ప్రేమికురాలిగా ఆవిడ దాదాపు 60 ఏళ్లుగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 30 వేల మొక్కలు నాటారు.

అవార్డును అందుకునేందుకు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చారు.

అవార్డును అందుకునేందుకు వెళ్లేటప్పుడు మధ్యలో ఆగి ప్రధాని మోదీకి అభివాదం చేసి వెళ్లారు. తర్వాత కూడా ప్రధాని.. తులసి గౌడతో ఆప్యాయంగా ముచ్చటించారు. 

తులసి గౌడ నిరుపేద కుటుంబంలో జన్మించారు. తన రెండేళ్ల వయసులోనే తండ్రి మరణించారు.

తల్లితో కలిసి స్థానిక నర్సరీలో పనికి వెళ్లారు. పన్నెండేళ్లలకే వివాహం చేసుకున్నారు.

 అనుకోని కారణాలరీత్యా భర్త కొంతకానికే మరణించారు.

ఆ సంఘటనతో కుంగిపోయిన తులసి అడవిలోని మొక్కలతో స్నేహం చేయడం ప్రారంభించింది.

ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో వాలంటీర్గా పనిచేయడం ప్రారంభించింది. తన అంకితభావాన్ని గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఆమెకు శాశ్వత ఉద్యోగాన్ని ఇచ్చారు.

ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయ్యారే గానీ మొక్కలకు.. తులసి గౌడకు విడదీయలేని బంధం ఏర్పడింది.