జై భీమ్.. తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన ఈ సినిమా దక్షిణాది బాషలన్నింటిలో విడుదలైంది.

జై భీమ్ సినిమా చూసిన వాళ్లందరు హీరో సూర్య గురించి ఏమో గానీ, సినతల్లి పాత్ర వేసిన లిజోమోల్ జోస్ గురించి మాత్రం ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.

 జై భీమ్ సినిమాలో సినతల్లి పాత్రే చాలా కీలకం. ఇక ఈ పాత్రలో లిజోమోల్ జోస్ నటన అదిరిపోయిందని చెప్పవచ్చు.

ఆమె నటన చూసిన ప్రేక్షకులు ఆహా.. ఓహో అనకుండా ఉండలేకపోతున్నారు.

  సూర్య లాంటి స్టార్ హీరో ఉన్నా కూడా ఈ కేరళ బ్యూటీ నటనకు అంతా మైమరచిపోతున్నారు.

ఈ సినిమాలో లిజోమోల్ గ్లామరస్ పాత్రల్లో నటించి ఆకట్టుకోలేదు. కానీ డీగ్లామర్ లుక్ లో, అదీ నిండు గర్భణిగా తన నటనతో అందరిని మైమరిపించింది.

లిజోమోల్ మొన్నా మధ్య హీరో సిద్ధార్థ్ సరసన ఒరేయ్ బామ్మర్ది అనే డబ్బింగ్ సినిమాలో నటించింది.

 ఐతే ఆ సినిమాలో లిజోమోల్ ను చూసిన వారు, జై భీమ్ లో  సినతల్లిగా నటించిందంటే అస్సలు నమ్మలేకపోతున్నారు. ఆమె రూపంతో, నటనతో, ప్రతిభతో అందరిని మరో లోకంలోకి తీసుకెళ్లింది లిజోమోల్.

కేరళ రాష్ట్రానికి చెందిన లిజోమోల్ జోస్ ది మధ్యతరగతి కుటుంబం. కొన్నాళ్లపాటు ఓ టీవీ ఛానల్లో లిజో ఉద్యోగం చేసింది. 

ఫాహద్ ఫాజిల్ నటించిన మహేశింటే ప్రతీకారం సినిమా రూపంలో లిజోకు ఫస్ట్ ఛాన్స్ దక్కింది. 

నటుడు అరుణ్ ఆంటోనీని ఇటీవల పెళ్లాడిన 29 ఏళ్ల లిజోమోల్ కెరీర్ లో, పలు సూపర్ హిట్ సినిమాలున్నాయి. 

2016లో వచ్చిన మలయాళ చిత్రం ‘రిత్విక్ రోషన్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘హనీ బీ 2.5’ ఈమెను  మరో మెట్టు ఎక్కించింది.

 శివప్పు’లో లిజో నటనను చూసిన త.శె.జ్ఞానవేల్ ‘జై భీమ్’లో చిన్నతల్లి పాత్ర కోసం అడిగారు. ఈ సినిమా/పాత్ర కోసం లీజో తనని తాను మార్చుకుంది.

“”

‘జై భీమ్’లో చిన్నతల్లి పాత్ర గురించి లీజో మాట్లాడుతూ.. ‘‘ఆ పాత్ర నుంచి పూర్తిగా బయటకు రాలేకపోయా. చిన్నతల్లి అనుభవించిన బాధ, ఆవేదన ఇప్పటికీ నాలో ఉండిపోయాయి. గతంలో నేను పోషించిన ఏ పాత్ర కూడా నన్ను ఇంతలా ప్రభావితం చేయలేదు’’ అని చెప్పడం విశేషం