ఇండియాలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి.

ఆ మాటకొస్తే.. ప్రపంచంలోని టాప్ ఐటీ సంస్థల్లోనూ ఇన్ఫోసిస్​ను ఒకటిగా చెప్పొచ్చు.

ఇన్ఫోసిస్ విజయం వెనుక, ఈ స్థాయికి చేరడం వెనుక దాని కో-ఫౌండర్ ఎన్​ఆర్ నారాయణ మూర్తి పాత్ర ఎంతో కీలకం. 

1981 నుంచి 2002 వరకు దాదాపు 21 ఏళ్లు ఇన్ఫోసిస్​కు సీఈవోగా వ్యవహరించారు మూర్తి. 

ప్రస్తుతం కాటమరాన్ వెంచర్స్ ఛైర్మన్​గా వ్యవహరిస్తున్నారు ఎన్​ఆర్ నారాయణ మూర్తి. 

తాజాగా వీకెండ్​లో ఐఐఎం అహ్మదాబాద్ విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు. 

ఐఐఎం స్టూడెంట్స్​తో తన జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మూర్తి. 

కార్పొరేట్ రంగంలో ఎదగాలనుకునే వారు ఏం చేయాలి? ఆ రంగంలో లీడర్లు ఎలా ఉండాలో ఆయన సూచించారు. 

జీవితంలో ఎన్ని విజయాలు అందుకున్నా ఒక విషయంలో మాత్రం తాను ఇప్పటికీ బాధపడతానన్నారు మూర్తి. 

తన తల్లి ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో ఆమెను ఇన్ఫోసిస్​కు ఆహ్వానించలేదన్నారు మూర్తి. 

అమ్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు కంపెనీకి ఆహ్వానించడం తాను చేసిన తప్పన్నారు. 

తల్లి విషయంలో తాను చేసిన ఈ తప్పుకు ఎన్​ఆర్ నారాయణ మూర్తి పశ్చాత్తాపం చెందారు. 

కార్పొరేట్ లీడర్ అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. 

తాము తీసుకోబోయే నిర్ణయాల వల్ల ప్రభావితమయ్యే వాటి గురించి, వాటితో నష్టపోయే పేదల గురించి కార్పొరేట్ లీడర్లు ఆలోచించాలని ఎన్​ఆర్ నారాయణ మూర్తి సూచించారు.