ఇప్పుడు ఎక్కడ చూసినా అపార్ట్ మెంట్ కల్చర్ కనిపిస్తుంది. దాంతో స్వచ్చమైన గాలి దొరకడం చాలా కష్టం అవుతుంది.

స్వచ్ఛమైన గాలి కోసం పెద్ద పెద్ద చెట్లు అవసరం లేకుండా ఇంట్లో పరిశుభ్రమైన గాలి వచ్చే విధంగా ఇండోర్ మొక్కలు లభిస్తున్నాయి.

ఇంటి మేడ మీద‌, బాల్క‌నీ, గోడ‌ల‌పై మొక్క‌ల‌ను పెంచుతూ ఉంటాం. ఉన్న ఆ కొంచెం స్థ‌లంలో ఎయిర్ ఫ్యూరిపైయింగ్ మొక్క‌ల‌ను పెంచుకుంటే మ‌న‌కు కావాల్సిన గాలిని పొంద‌వ‌చ్చు.

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ ఉంటే  సంపదలను పొందడంలో సహాయపడుతుందని చాలా మంది చెబుతుంటారు. దీనికి ఎక్కువ సూర్యకాంతి అవసరం లేదు. ఈ మొక్క 24 గంటల పాటు ఆక్సీజన్ విడుదల చేస్తుంది. ఫార్మాల్డిహైడ్, బెంజిన్ వంటి వాయువులను కూడా పీల్చుకుంటుంది.

తులసి

భారతీయులు భక్తితో పూచింజే మొక్కల్లో తులసి ఒకటి. ఈ మొక్కని క్విన్ ఆఫ్ హెర్బ్స్ గా పిలుస్తారు. తులసిలో అద్భుతమైన ఔషదాలే కాదు.. రోజుకి 20 గంటలు ఆక్సీజన్ ని విడుదల చేస్తుంది.

స్పైడర్ ప్లాంట్

ఈ మొక్క గాలిని అధిక శాతంలో శుద్ది చేస్తుంది.. స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అందుకే ఈ మొక్కను ఎక్కువగా ఇండోర్ ప్లాంట్ గా పెంచుకుంటారు.

అరెకా ఫామ్

ఈ మొక్క కూడా ఇండోర్ ప్లాంట్ గా చాలా బాగుంటుంది. ఈ మొక్క గాలిలోని కాలుష్యకారక వాయువులను పీల్చుకొని శుద్ది చేస్తుంది.

స్నేక్ ప్లాంట్

నాసా గుర్తించిన ఎయిర్ ప్యూరీ ఫైరింగ్ మొక్క. ఈ మొక్క ఇంట్లోని గాలిలో ఆక్సీజన్ శాతం శుద్ది చేస్తుంది.

పీస్ లల్లీ

ఇది ఒక అందమైన పూల మొక్క. తెల్లని పూలు పూయడమే కాదు.. గాలిలో ఉండే మలినాలను తొలగించి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.

ఫ్లమింగో లిల్లీ

ఈ మొక్కకు కూడా అందమైన పూలు పూస్తాయి. అంతే కాదు ఈ మొక్క అద్భుతమైన సువాసనను వెదజల్లుతాయి.

ఇంగ్లీష్ ఇవి : గోడలపై, చెట్లపై ఈ మొక్కలను పెంచుతారు. సూర్య రశ్మి మనపై పడకుండా ఈ మొక్క కాపాడుతుంది.