గూగుల్ తర్వాత వారి వీడియో విభాగమైన  యూట్యూబ్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో  ఆదరణ ఉంది.

చాలా తక్కువ సమయంలో యూట్యూబ్‌  ఒక గొప్ప వ్యవస్థగా ఎదిగింది

అలాంటి ఒక గొప్ప సోషల్ మీడియాలో ప్లాట్  ఫామ్ కి ఒక ఇండియన్ అమెరికన్ నీల్  మోహన్‌ సీఈవోగా బాధ్యతలు  తీసుకోనున్నారు.

సీఈవోగా ఉన్న సూసన్ వొజిసికి పదవి  నుంచి వైదొలగడంతో నీల్ మోహన్ ను  సీఈవోగా ప్రకటించారు.

సూసన్ వొజిసికి కుటుంబ,  ఆరోగ్య కారణాల రీత్యా యూట్యూబ్ సీఈవో  బాధ్యతల నుంచి వైదొలిగారు.

ఇప్పటికే గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్,  మైక్రోసాఫ్ట్ ఈసీవోగా సత్య నాదెళ్ల,  కొనసాగుతున్నారు. 

ఇప్పుడు ఈ జాబితాలోకి యూట్యూబ్  సీఈవోగా నీల్ మోహన్ వచ్చి చేరారు.

నీల్ మోహన్ కు సుందర్ పిచాయ్  అభినందనలు తెలియజేశారు. 

యూట్యూబ్ ను సమర్థవంతంగా ముందుకు  తీసుకెళ్లాలంటూ ఆకాంక్షించారు

నీల్ మోహన్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ  నుంచి ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్  పూర్తి చేశారు.

2008లో గూగుల్ లో చేరారు. 2015లో  గూగుల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గా  బాధ్యతలు స్వీకరించారు.

యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్,  ప్రీమియం, యూట్యూబ్ షార్ట్స్ రూపకల్పనలో  నీల్ మోహన్ కీలకపాత్ర పోషించారు.

నీల్ మోహన్ దాదాపు 8 ఏళ్లపాటు  గూగుల్ కు చెందిన డిస్ ప్లే, వీడియో  అడ్వటైజింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా  వ్యవహరించారు.

నీల్ మోహన్ యూట్యూబ్ సీఈవో  కావడంపై దిగ్గజాలే కాదు.. భారతీయులు  కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.