టికెట్లు లేని ప్రయాణం నేరం అని తెలిసి కూడా అనేక మంది రైళ్లు, బస్సుల్లో అక్రమంగా ప్రయాణిస్తుంటారు

ముఖ్యంగా రైళ్లల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. శిక్షార్హులు అని తెలిసి కూడా నిర్లక్ష్యంతో్ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తుంటారు

చెకింగ్ సమయంలో టికెట్ కలెక్టర్‌కు దొరికిపోయి..జరిమానా రూపంలో జేబులు ఖాళీ చేసుకుంటుంటారు.

అయితే  ఇటువంటి వారిపై  దృష్టి సారించిందీ దక్షిణ మద్య రైల్వే. టికెట్ లేకుండా ప్రయాణించిన అనేక మందిని గుర్తించి జరిమానాలు విధించారు టీసీలు

ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణాల్లోని  ప్రధాన రైల్వే స్టేషన్‌ల్లో వసూలు చేసిన జరిమానా వింటే తెల్లబోవాల్సిందే. కోట్ల ఆదాయమే సమకూరింది.

రోసాలైన్ అరోకియా మేరీ అనే మహిళా చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ అక్రమంగా ప్రయాణీస్తున్న వ్యక్తుల ద్వారా జరిమానా విధించి రూ.1.03 కోట్లు వసూలు రాబట్టారు.

పెనాల్టీల రూపంలో కోటి రూపాయలకు పైగా  వసూలు చేసిన తొలి మహిళా ఉద్యోగినిగా ఆమె నిలిచారు

డిప్యూటీ చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ ఎస్ నంద కుమార్ 27,787 కేసులు నమోదు చేసి రూ.1.55 కోట్లు జరిమానా వసూలు చేశారు.

విజయవాడ డివిజన్‌లో ఎంజె.మాథ్యూ అనే చీఫ్‌ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్  ఏడాది కాలంలో టికెట్ లేని ప్రయాణీకుల నుండి  రూ.1.02 కోట్లు జరిమానాల రూపంలో వసూలు చేశారు. 

35ఏళ్ల కెరీర్‌లో మాథ్యూ జిఎం అవార్డుతో పాటు డిఆర్ఎం అవార్డు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌ అవార్డులు పొందారు.

సీనియర్ టికెట్ ఎగ్జామినర్ శక్తివేల్ రూ.1.01 వసూలు చేసినట్టు దక్షిణ రైల్వే తెలిపింది. 

సికింద్రబాద్‌ రైల్వే డివిజన్‌లో కూడా మరో ఏడుగురు అధికారులు కోటికి పైగా జరిమానాలు వసూలు చేశారు

గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 16 వరకూ టికెట్ లేని ప్రయాణీకుల నుండి జరిమానాల రూపంలో ఈ వసూళ్లను రాబట్టినట్లు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.

సో.. ఇక బీ అలర్ట్ ప్రయాణీకులారా.. టికెట్ తీసుకునే రైలు ప్రయాణం చేయండి..