మూస క్రికెట్‌ను మడతపెట్టి కొట్టిన క్రికెటర్‌ రాబిన్‌ సింగ్‌!  ఇండియన్‌ క్రికెట్‌లో ఇతని పాత్ర ఏంటి?

నైన్టీస్‌లో సచిన్‌, గంగూలీ లాంటి హేమహేమీలతో  భారత్‌ బ్యాటింగ్‌ బలంగా ఉన్నా.. ఫీల్డింగ్‌లో మాత్రం  మనం పసికూనలమే.

టీమిండియా..  తొలిసారి పక్కకు డైవ్‌ చేస్తూ..  బాల్‌ను ఆపే ఫీల్డర్‌ను చూసింది.. అతనే రాబిన్‌ సింగ్‌.

టీమిండియా..  తొలిసారి పక్కకు డైవ్‌ చేస్తూ..  బాల్‌ను ఆపే ఫీల్డర్‌ను చూసింది.. అతనే రాబిన్‌ సింగ్‌.

ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చి బ్యాటింగ్‌, బౌలింగ్‌తో  పాటు ఫీల్డింగ్‌లోనూ కొత్త ఒరవడి సృష్టించాడు.

1999 వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్‌లో  ప్రధాన బౌలర్లు విఫలమైన వేళ.. హ్యాట్రిక్‌తో పాటు 5  వికెట్లు పడగొట్టి ఇండియా గెలిపించాడు.

తన బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు.  షేన్‌ వార్న్‌ లాంటి దిగ్గజ బౌలర్లను సిక్సులతో  ఓ ఆట ఆడుకున్నాడు.

ఆస్ట్రేలియాపై 1999లో చేసిన  30 బంతుల్లో 75 పరుగుల ఇన్నింగ్స్ఇ ప్పటికీ ఓ  మరపురాని సంఘటనే.

100 పరుగులలోపే 4 కీలక వికెట్లు పడ్డా..  రాబిన్‌ సింగ్‌ ఉన్నాడులే అనే ధైర్యం ఇచ్చాడు.

అనేక సందర్భాల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో  టీమిండియాకు అపద్బాంధవుడిలా మారాడు.

జట్టులో అతనుంటే బ్యాటర్‌, బౌలర్‌, ఫీల్డర్‌  రూపంలో ముగ్గురు ఆటగాళ్లు జట్టులో ఉన్నట్లే. 

ఇంత టాలెంట్‌ ఉన్నా.. రాబిన్‌కు రావాల్సినంత  పేరు, గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి.

అజయ్‌ జడేజాతో కలిసి రాబిన్‌ సింగ్‌ ఎన్నో మెరుపు  ఇన్నింగ్స్‌లు పాత తరం అభిమానుల గుండెల్లో చెక్కు  చెదరకుండా ఉన్నాయి.

రాబిన్ సింగ్.. టీమిండియా తరఫున 136 వన్డేలు ఆడి  2336 పరుగులు చేశాడు. అలాగే 69 వికెట్లు  తీసుకున్నాడు.

ఇక ఆటకు వీడ్కోలు పలికిన రాబిన్‌ సింగ్‌..  కోచింగ్‌ వైపు తన కెరీర్‌ను కొనసాగించాడు.

టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో  ముంబై ఇండియన్స్‌కు పలు విభాగాల్లో  కోచ్‌గా పనిచేశాడు