అతడు టీమిండియా స్టార్ క్రికెటర్. దాదాపు ఆరేళ్ల పాటు జట్టు తరఫున వన్డే, టీ20 మ్యాచులాడాడు.

దేశవాళీలో తొలుత రాణించి ఐపీఎల్ లో అడుగుపెట్టాడు. అక్కడా అదరగొట్టి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.

ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా లైఫ్ ని ఆస్వాదిస్తున్నాడు. సడన్ గా అతడి తండ్రి మిస్సింగ్ అనే వార్తలొచ్చాయి.

ఆ క్రికెటర్ పేరు కేదార్ జాదవ్. ఐపీఎల్ లో బెంగళూరు, చెన్నై, దిల్లీ జట్లకు ఆడిన ఇతడిని తాజా సీజన్ లో ఎవరూ తీసుకోలేదు.

సాధారణంగా క్రికెటర్ల వ్యక్తిగత విషయాల్లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే అభిమానులు అలెర్ట్ అయిపోతారు.

ఏం జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలు తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు.

తాజాగా తన తండ్రి పేరు మహాదేవ్ జాదవ్ తప్పిపోయారని స్వయంగా కేదార్ జాదవ్ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టాడు.

సోమవారం అంటే మార్చి 27 ఉదయం 11:30 గంటలకు మహాదేవ్ జాదవ్ రిక్షా ఎక్కి బయటకెళ్లారు.

ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. చాలాచోట్ల వెతికినా కనిపించలేదు. దీంతో జాదవ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.

దీంతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. కేవలం నాలుగు గంటల్లోనే మహాదేవ్ జాదవ్ ఆచూకీ కనిపెట్టారు.

ఈ క్రమంలోనే పోలీసు స్టేషన్ లో నాన్న కూర్చుని ఉన్న మరో ఫొటోని కేదార్ జాదవ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.

దీంతో జాదవ్ కుటుంబ సభ్యులే కాదు టీమిండియా క్రికెట్ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉండగా ఐపీఎల్ లో అదరగొట్టిన జాదవ్.. 2014లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి 2020 వరకు ఆడాడు.

అంతర్జాతీయ కెరీర్ లో 73 వన్డేలు, 9 టీ20లు ఆడి.. వరసగా 1389, 58 పరుగులు చేశాడు.  

ఐపీఎల్ లోనూ పలు ఫ్రాంచైజీల తరఫున 93 మ్యాచుల్లో 1196 పరుగులు చేశాడు. ప్రస్తుతం టోర్నీలో ఆడట్లేదు.

మరి క్రికెటర్ కేదార్ జాదవ్ తండ్రి తప్పిపోయి, తిరిగి ఇంటికి చేరుకోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.