వన్‌ప్లస్ ఫోన్లకు మన దగ్గర ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ నార్డ్ సిరీస్ మొబైల్స్ అంటే జనాలు ఎగబడి మరీ కొంటున్నారు.
ఇలాంటి సమయంలో వినియోగదారులకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశ్యంతో వన్‌ప్లస్ సంస్థ ఇయర్ బడ్స్ మార్కెట్ పై దృష్టిసారించింది.
వరుసగా ఇయర్‌బడ్స్ మోడల్స్ ను విడుదల చేస్తూ యూజర్లను పెంచుకుంటోంది. సాదారణంగా భారత మార్కెట్లో.. లో కాస్ట్, మిడ్ రేంజ్ ప్రొడక్ట్స్‌కు అధిక డిమాండ్ ఉంటుంది.
ఇక.. ఫీచర్ల విషయంలో కూడా ఎక్కడా రాజీపడకుండా దీన్ని రూపొందించడం విశేషం. 12.4mm టైటానియం డ్రైవర్స్, 30 గంటల బ్యాటరీ లైఫ్, డాల్బీ అట్మోస్ వంటి అధునాతన ఫీచర్స్ ఇందులో అమర్చారు.
ఈ-కామర్స్ వెబ్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తో పాటు వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, వన్‌ప్లస్ స్టోర్ యాప్‌లో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి..
ధర రూ.2,799గా ఉంది. అసలు ధర రూ.2,999కు కాగా.. ప్రస్తుతం రూ.200 ఆఫర్ ఉంది. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లు లభ్యమవుతున్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్.. 12.4 మిల్లీమీటర్ల టైటానియం డైనమిక్ సౌండ్ డ్రైవర్స్‌తో వస్తున్నాయి. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది.
అలాగే కాల్ క్వాలిటీ కోసం బడ్స్ కు మైక్రోఫోన్స్ అమర్చారు. పరిసరాల శబ్దాలను నిరోధించేలా AI ఆధారిత నాయిస్ రిడక్షన్ అల్గారిథమ్స్‌ను ఈ బడ్స్‌లో పొందుపరిచినట్టు వన్‌ప్లస్ సంస్థ పేర్కొంది.
కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2 వర్షన్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్, ఐఫోన్లతో పాటు అన్ని డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సింగిల్ చార్జ్‌పై 7 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఇస్తాయి. ఇక చార్జింగ్ కేస్‌తో ఈ బడ్స్‌ను మూడుసార్లకు పైగా చార్జ్ చేసుకోవచ్చు.
అంటే కేస్‌తో కలిపి మొత్తంగా 30 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అలాగే 10 నిమిషాల చార్జింగ్‌తో 5 గంటల ప్లేబ్యాక్ ఆడియో వచ్చేలా ఫ్లాష్ చార్జ్ సపోర్ట్‌తో ఈ బడ్స్ రూపొందించారు.