వాతావరణం, ఆహారపు అలవాట్లు ఇలా కారణం ఏదైనా ప్రస్తుతం జుట్టు ఊడటం అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది.
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈ సమస్య మరింతగా పెరిగిపోయింది.
అయితే చాలామంది ఎంత డబ్బు ఖర్చుచేసినా ఈ సమస్యను అధిగమించలేకపోతున్నారు.
కొందరైతే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం వెళ్లి చేతులు కాల్చుకుంటున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం.
అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలతో జుట్టు ఊడిపోవడాన్ని కంట్రోల్ చేయచ్చు, ఊడిన జుట్టు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
చాలా మంది కలబందను రాస్తుంటారు. అయితే దానిని జెల్‌గా కాకుండా జ్యూస్ లా చేసి రాసుకుంటు ఎక్కువ ప్రభావం ఉంటుంది.
జెల్ రాసుకుంటే అది స్కాల్ప్ మీదనే ఉండిపోతుంది. అదే పలచగా జ్యూస్ లాగా చేసుకుని రాసుకుంటే కుదుళ్లకు పడుతుంది.
శరీరంలో విటమిన్ బి12 తగ్గడం వల్లే జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది.
100 గ్రాముల కలబంద లిక్విడ్ లో 10.9 మైక్రోగ్రామ్స్, విటమిన్ బి 12, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి ఉంటాయి.
ఇవన్నీ కలిసి ఊడిన జుట్టు స్థానంలో కొత్త వెంట్రుకలు రావటానికి బాగా సహాయపడతాయి.
అంతేకాకుండా అలోవిరా వాడటం ద్వారా జుట్టు డ్రై కాకుండా ఉంటుంది.
అలోవిరా జ్యూస్ రాయడం ద్వారా చుండ్రు సమస్య నుంచి కూడా విముక్తి పొందే అవకాశం ఉంటుంది.
అలోవెరా జెల్ కాకుండా జ్యూస్ అప్లై చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
జ్యూస్ కుదుళ్లకు పట్టడం ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే కలబందను జెల్‌గా కాకుండా జ్యూస్ గా వాడాలని సూచిస్తున్నారు.