నేడు జనాల్ని ప్రధానంగా వేధిస్తున్న సమస్య జుట్టు ఊడిపోవటం.

ఈ మధ్య కాలంలో ఆడ, మగ తేడా లేకుండా జుట్టుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. 

కొంతమంది జుట్టు ఊడిపోతే తమ ప్రాణాలు పోతున్నట్లుగా భావిస్తున్నారు. 

జుట్టును కాపాడుకోవటం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆయిల్స్‌, షాంపూలు వాడివాడి విసిగి చెందిపోతున్నారు. 

అలాంటి వారు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో చేసిన హేయిర్‌ మాస్కులను జుట్టుకు వాడితే మంచి ఫలింతం ఉంటుంది.

బచ్చలికూరతో తయారుచేసిన హెయిర్ మాస్క్ జుట్టు సంరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. 

బచ్చలికూర మాస్కులో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ, సి లు మాడులో నూనె ఎక్కువగా ఉత్పత్తి అ‍వ్వకుండా చేస్తాయి.

అరటిపండు కేవలం మన శరీరానికే కాదు జట్టుకు కూడా మంచి చేస్తుంది. 

ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్ల పుష్కలంగా ఉంటాయి.  

అరటి పండు హెయిర్‌ ప్యాక్‌ వేసుకుంటే హెయిర్ ఫాల్‌ తగ్గడమే కాదు చుండ్రు కూడా దూరం అవుతుంది.

ఉరిసి ప్యాక్‌తో చుండ్రు దూరం అయి జుట్టు రాలటం తగ్గుతుంది.

నిమ్మరసం కూడా జట్టు సమస్యలకు ఎంతో చక్కగా పనిచేస్తుంది.

చుండ్రును నివారించి జట్టు మంచిగా పెరిగేలా చేస్తుంది.