చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే వాటికి వంటింట్లో ఉండే మసాలా దినుసులతో చెక్ పెట్టచ్చు.

ఆయుర్వేద వైద్యంలో అల్లాన్ని ఉపయోగిస్తారు.

శరీరంలో ఉండే చెడు పదార్థాలను అల్లం తరిమికొడుతుంది. 

అల్లం తింటే వికారం ఇట్టే పోతుంది. 

మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

లివర్ కి మెంతులు మేలు చేస్తాయి. 

పసుపు యాంటీ బయాటిక్ అని మనకి తెలిసిందే. 

పసుపు వాతం, కఫం వంటి సమస్యలను తొలగిస్తుంది. 

పసుపుతో కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 

షుగర్ సమస్య ఉన్న వాళ్ళు పసుపు తీసుకుంటే మంచిది. 

పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి.

ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

దంత సమస్యలు, చర్మ సమస్యల నుంచి దాల్చిన చెక్క సహాయపడుతుంది. 

జీర్ణ వ్యవస్థను ఇది మెరుగుపరుస్తుంది.