వేసవికాలం వచ్చిందంటే వడదెబ్బ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ వడదెబ్బ కారణంగా చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
వడదెబ్బ రెండు రకాలుగా ఉంటుంది. క్లాసిక్ హీట్ స్ట్రోక్, ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్. మొదటి దాని వల్ల వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతారు.
వడదెబ్బ తగిలిన వ్యక్తిలో ఒళ్ళు నొప్పులు, అలసట, కళ్ళు తిరగడం, చర్మం కందిపోవడం, మైకం, వికారం, వాంతులు, చెమట పట్టడం, విపరీతమైన దాహం, తక్కువ మూత్ర విసర్జన, గుండ వేగంగా కొట్టుకోవడం, స్పృహ కోల్పోవడం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వడదెబ్బ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే మెదడు వాపు, నరాలు దెబ్బ తినడం, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ అవ్వడం, కోమాలోకి వెళ్లడం జరుగుతాయి.
డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఉన్నవారు శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోవాలి.
ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్నం బయటకు వెళ్ళకపోవడం మంచిది.
అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండలో తిరగకపోవడమే మంచిది.
బయటకు వెళ్లాల్సి వస్తే ముదురు రంగు దుస్తులు కాకుండా తేలికపాటి లేత రంగు దుస్తులను ధరించాలి.
వేసవిలో మద్యానికి దూరంగా ఉండడం ఉత్తమం. మద్యం శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది.
కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన నిమ్మరసం వంటి ద్రవాలు తాగాలి. ఇవి శరీరంలో కోల్పోయిన లవణాలను భర్తీ చేస్తాయి.
వడదెబ్బ బారిన పడకుండా ఉండడం కోసం దోసకాయలు,పుచ్చకాయలు, బత్తాయి, దానిమ్మ వంటివి తినాలి.
ఉదయం 8 గంటల లోపు తేలికపాటి వ్యాయామాలు పాటించాలి. వడదెబ్బ తగిలితే వెంటనే చికిత్స అందించాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.
ఉదయం 8 గంటల లోపు తేలికపాటి వ్యాయామాలు పాటించాలి. వడదెబ్బ తగిలితే వెంటనే చికిత్స అందించాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.
వడదెబ్బ తగిలిన వారికి ప్రథమ చికిత్సగా మెడ, ముఖంపై ఐస్ ప్యాక్ పెట్టాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని వాతావరణంలోకి తీసుకెళ్లాలి.
గాలి ఆడడం కోసం ఒంటిపై ఉన్న దుస్తులు లూజ్ చేయాలి. నీరు, కొబ్బరి నీళ్లు, చెరకు రసం, పెరుగు, మజ్జిగ, పండ్ల రసాలు వంటివి తాగించాలి.
వడదెబ్బ ప్రభావం తీవ్రంగా ఉంటే ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.