తీపి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది చక్కెర.

తియ్యటి పదార్ధాలను నూటికి 90 శాతం చక్కెరతోటే తయారు చేస్తూ ఉంటారు. 

నిత్య జీవితంలోనూ చక్కెరను విరివిగా వాడుతుంటారు. 

ఉదయం లేచినప్పటినుంచి మొదలుకునే రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక చక్కెర కలిపిన వస్తువు మనం తీసుకుంటూ ఉంటాం.

అయితే, చక్కెర తీసుకోవటం అన్నది అంత మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. 

చక్కెర మన మెదడుపై మత్తు పదార్థంలా పని చేస్తుందని అంటున్నారు. 

ఓ సారి చక్కెర రుచి మరిగిన నాలుకపై రుచి గుళికలు ప్రతీసారి తీపిని కోరుకుంటాయని అంటున్నారు. 

అదే చక్కెరను తినటం మానేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. అవేంటంటే..

చక్కెర తినటం మానేయటం వల్ల అధిక క్యాలరీలు దరి చేరవు. 

తద్వారా అధిక బరువు పెరుగుతామన్న భయం ఉండదు.

శరీరంలో వాపులు తగ్గుతాయి. గుండె, లివర్‌ ఆరోగ్యంగా ఉంటాయి.

క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

మునుపటితో పోల్చుకుంటే శక్తి, సామర్థ్యాలలో తేడా వస్తుంది. ఎనర్జీగా ఉంటాం.

చక్కెరను తినటం మానటం వల్ల మానసికంగా, శారీరకంగా మంచి ఫలితాలు ఉంటాయి.