కొంతమంది నిద్రరాక బాధపడుతుంటారు..  వాళ్లు ఎంత ప్రయత్నించినా సరే అస్సలు నిద్రపట్టదు. ఆ సమస్యకు కారణాలు వేరు.

మరికొందరు అతి నిద్రతో బాధపడుతుంటారు. కంటినిండా నిద్ర మంచిదే కాదనీ అతి నిద్ర వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ.

రోజుకి 8 గంటలకన్నా ఎక్కువగా నిద్రపోతే అది ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

ఎక్కువ నిద్రపోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు పెరిగే అవకాశముంది. స్ట్రోక్ సమస్య కూడా రావొచ్చు.

ఎక్కువగా నిద్రపోవడం వల్ల మనిషి శారీరక శ్రమ తగ్గుతుంది. దీని కారణంగా మీ మానసిక స్థితి కూడా ప్రభావితమవతుంది.

ఎక్కువగా నిద్రపోవడం వల్ల ఊబకాయానికి గురయ్యే అవకాశం పెరుగుతుంది. 

దీనితోపాటే మధుమేహం, గుండెజబ్బులు కూడా చుట్టుముడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అతిగా నిద్రపోవడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

ఎక్కువగా నిద్రపోయినప్పుడు శరీరం, చక్కెరని ప్రొసెస్ చేసే సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మధుమేహానికి దారితీస్తుంది.

ఇన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అతిగా నిద్రపోయే అలవాటు మానుకోండి.

అయితే నైట్ షిప్ట్ చేసేవారికి నిద్ర విషయంలో మినహాయింపు ఉంది. రోజులో సగం నిద్రకే కేటాయిస్తారు కాబట్టి.. వీళ్లు ఎక్కువ సమయం పడుకోవచ్చు.

అయితే వీళ్లు కచ్చితంగా వ్యాయామానికి కూడా సమయం కేటాయించాలి. లేకపోతే ఊబకాయంతో పాటు చాలా సమస్యలు వచ్చే ప్రమాదముంది.