గత కొన్ని రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల వేడి నుంచి చాలా మంది వడదెబ్బలతో చనిపోతున్నారు.
దీని కారణంగా చాలా మంది ప్రజలు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటేనే వెనకడుగు వేస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఎండాకాలంలో ఈ లక్షణాలు మీకు కనిపిస్తే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు
ఎండాకాలంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రాణానికి ప్రమాదం.
అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
తలనొప్పి, కళ్లు తిరిగి పడిపోవడం, వాంతులు లేదా విరేచనాలు ఉంటే ఇది వడదెబ్బ లక్షణంగా పరిగణించవచ్చు
చర్మం మృదువుగా, పొడిబారడం, హృదయ స్పందన పెరగడం వంటి లక్షణాలు కూడా వడదెబ్బ లక్షణాలుగా గుర్తించాలి.
ఎక్కువ సమయం నీడలో ఉండి సెడన్ గా ఎండలోకి వస్తే కూడా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది.
ఎండాకాలంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
వైద్యుడిని సంప్రదించడం కంటే ముందుగా వడదెబ్బ తగిలిన వ్యక్తిని ఓ చల్లటి ప్రదేశంలో తీసుకెళ్లాలి.
ఆ తర్వాత చల్లటి గుడ్డతో శరీరాన్ని తుడవాలి. వీలైతే స్నానం కూడా చేయించాలి.
వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఇవన్ని చేసిన తర్వాత వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి.
వడదెబ్బ తగిలితే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నోట్: ఇది కేవలం మీకు అవగాహన కోసమే. ఏమైన సందేహాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి