చాలా మంది ఎవరినైనా తిట్టడానికి వాడే పదం బుడంకాయ. రేయ్ బుడంకాయ్ పక్కకి పో అని అంటారు. ఆ బుడంకాయ విలువ తెలిస్తే బుజ్జి ఇలా రా అని అంటారు.
బుడిమకాయ, బుడమకాయ అని కూడా పిలుస్తారు. వాడుక భాషలో బుడంకాయ్ అని అంటారు.
బుడ్డకాయ మొక్క, కుప్పంటి మొక్క అని పిలిచే మొక్కలకి కాచే కాయలే ఈ బుడిమకాయలు.
గ్రామాల్లో రోడ్ల పక్కన, పొలాల గట్ల మీద మొలుస్తుంటాయి. ఈ మొక్కలు చిన్న చిన్న కాయలతో.. ముదురు ఆకులతో.. రెండున్నర అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది.
పండిన బుడంకాయలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఆయుర్వేదంలో అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో బుడంకాయలను ఎక్కువగా వాడతారు.
కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులను నయం చేయడంలో ఈ బుడంకాయలు బాగా ఉపయోగపడతాయి.
గుండె ఆరోగ్యానికి ఈ కాయలు మంచివి. గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.
ఈ కాయలు తింటే ఊబకాయం రాదు. కాలేయంలో వ్యర్థ పదార్థాలు ఉంటే ఈ బుడంకాయలు తొలగిస్తాయి.
కిడ్నీ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే ఈ బుడంకాయలు తింటే తగ్గుతాయి.
ప్రతిరోజూ ఈ కాయలను తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారు ఈ కాయలను తింటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఈ బుడంకాయలకు ఉంది.
కంటి సంబంధిత సమస్యలను నయం చేయడానికి ఈ బుడంకాయలను ఆయుర్వేదంలో వాడతారు.
పచ్చివి కాకుండా పండిన బుడంకాయలను మాత్రమే తినాలి. కొందరికి వీటిని తింటే అలర్జీ వస్తుంది. అలాంటి వారు తినకపోవడమే మంచిది.
అలానే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోకూడదు.
నోట్: పైన టిప్స్ పాటించే ముందు డాక్టర్స్, నిపుణుల సలహాలు కూడా ఓసారి తీసుకోండి.