ఓట్స్ తింటే మన ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎన్నో లాభాలు  కూడా ఉన్నాయి.

ఓట్స్ లో సహజమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్, సోడియం కూడా అధికంగా ఉంటాయి.

అందుకే ప్రతిరోజు ఓట్స్ ను పాలల్లో కొంచెం బెల్లం వేసుకొని బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకుంటూ ఉంటారు.

ఓట్స్ ని రాత్రంతా నానబెట్టి.. పొద్దున్నే వాటిలో పండ్ల ముక్కలు, నట్స్, చియా సీడ్స్ వేసుకొని తీసుకుంటారు.

ఇలా ఓట్స్ వల్ల కాల్షియం, ఐరన్ లభిస్తాయి. ఇలా నూనె లేని బ్రేక్ ఫాస్ట్ ని పొద్దున్నే తినడం వల్ల మన హెల్త్ మెరుగుపడుతుంది.

ఓట్స్ లో రెండు రకాలున్నాయి. వీటిలో మొదటిది స్టీల్ కట్ ఓట్స్. దీన్ని ఐరిస్ ఓట్ మీల్ అని పిలుస్తారు.

తక్కువ ప్రాసెస్ చేసి వీటిని తయారు చేస్తారు. ఇలా చేయడం కోసం ఓట్స్ ని కట్ చేసి చేస్తారు.

ఇవి నమలడానికి బాగుంటాయి, గట్టిగా కూడా ఉంటాయి. వీటిని యూజ్ చేసేముందు ఒక 15 లేదా 20 నిముషాలు నానబెట్టాలి.

వీటితో సలాడ్స్, కిచిడి, పొంగల్, ఉప్మా, చపాతీ, దోస, పకోడీస్ లాంటి మిగతా ఫుడ్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు.

ఇక రెండో రకం రోల్డ్ ఓట్స్. ఇది చాలా పాత ఫ్యాషన్. ఎక్కువ సార్లు ప్రాసెసింగ్ చేసి తయారు చేస్తారు.

స్ట్రీమింగ్ మరియు ప్లేటనింగ్ ప్రాసెస్ చేసి రోల్డ్ ఓట్స్ ని తయారు చేస్తారు .అందువల్ల అవి సాఫ్ట్ గా మారుతాయి.

ఎక్కువ ప్రాసెస్ చేయడం వలన వండడం చాలా సులువు. వీటిని తయారు చేసుకోవడనికి 2 నుంచి 5 నిమిషాలు చాలు.

ఈ ఓట్స్ తో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. కేక్స్, బ్రెడ్, స్మూతీస్, కుకీస్ లాంటి వాటిని తయారు చేస్తారు.

నోట్: మాకు అందుబాటులోని సమాచారం ఆధారంగా పైనవి రాసుకొచ్చాం. యూజర్స్ గమనించగలరు!