బొప్పాయిలో  పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.. 

ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి

భోజనం చేసిన తర్వాత బొప్పాయి తీంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

 బొప్పాయి గుజ్జు లో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటుంది.. ఇది రోగ నిరోధక శక్తిని సమృద్దిగా ఇస్తుంది.

బొప్పాయి తరుచూ తినడం వల్ల జలుబు, ఫ్లూ, శ్వాస కోస ఇన్ఫెక్షన్లను కలిగించే బాక్టీరియా, వైరస్ నుంచి మంచి రక్షణ ఇస్తుంది.

బొప్పాయి ఉదర సంబంధిత జబ్బులను మాయం చేస్తుంది. 

ఇందులో ఉండే సి విటమిన్ దంతాల,చిగుళ్ళ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. 

బొప్పాయిలో ఉండే విటమిన్ బి వల్ల నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్ల నుంచి కాపాడుతుంది.

బొప్పాయి కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా చూస్తుంది.

రెగ్యూలర్ గా బొప్పాయి తినడం వల్ల మలబద్దక సమస్యలను దూరం చేస్తుంది.

డయాబెటీస్ ఉన్న వారు  బొప్పాయిని తిన్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. 

బొప్పాయిలో ఉండే జియాక్సంతిన్, లుటిన్ లు గ్లామకో.. కంటి శుక్లం, కంటి సమస్యలు రాకుండా ఉంచుతాయి.

తరుచూ బొప్పాయి తినడం వల్ల కీళ్ళనొప్పుల వల్ల వచ్చే వాపును తగ్గిస్తుంది. 

బీపీ ఉన్నవారు  తమ డైట్ లో బొప్పాయిని చేర్చడం వల్ల ఆరోగ్యానికి చక్కటి మేలు జరుగుతుంది.