మన భారతీయ సంస్కృతిలో చాలా మంది ఇంటి ముందు ఖచ్చితంగా ఓ తులసి మొక్కని పెంచుతున్నారు.
ఎంతో దైవంగా కొలిచే ఈ తులసి చెట్టు ఆకులతో పాటు గింజలలో కూడా ఎన్నో ఔషద గుణాలు కలిగి ఉంటాయని మాత్రం చాలా మందికి తెలియదు.
విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఈ తులసి గింజలు గుండె పోటు సమస్య నుంచి కూడా రక్షిస్తుందట. ఇక ఇవే కాకుండా శరీరానికి హాని చేసే ప్రీరాడిక్స్ నుంచి కూడా ఈ తులసి గింజలు పూర్తి రక్షణ కల్పిస్తాయట.