ఆకుకూరల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఆకుకూరలు బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. అలానే గుండెను ఆరోగ్యానికి కూడా ఆకుకూరలు మేలు చేస్తాయి.
ఆకుకూరల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పాలకూర, బచ్చలికూర, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి ఆకుకూరల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.
ఇవి కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీని వల్ల అధిక బరువు సమస్య దరిచేరదు.
ఆకుకూరల్లో ఉండే పోషకాలు.. డయాబెటిస్, అల్జీమర్స్, ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
రోజూ 30 గ్రాముల ఫైబర్ తీసుకోవడం వల్ల డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అలానే బరువు వేగంగా తగ్గుతారని చెబుతున్నారు.
నైట్రేట్ అధికంగా ఉండే ఆకు కూరలను తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలను తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఆకుకూరల్లో ఉండే గ్లూకోసినోలేట్స్ చెడు కొవ్వుని తగ్గిస్తాయి.
కొవ్వు పేరుకుపోవడం గుండె జబ్బులకు దారి తీస్తుంది. ఆకుకూరలు తింటే చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉండదు.
అంతేకాదు ఆకుకూరల్లో ఉండే గ్లూకోసినోలేట్స్ కి క్యాన్సర్ తో పోరాడే శక్తి ఉంటుందని చెబుతున్నారు.
ఆకుకూరలు తినడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అంటున్నారు.
ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, మూత్రాశయం, సమస్యలు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, ప్యాంక్రియాటిక్ వంటి ప్రమాదాలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆకుకూరల్లో ఉండే ఎంజైములు డీఎన్ఏ నష్టాన్ని నివారించడానికి బాగా సహకరిస్తాయని చెబుతున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం అంతర్జాలం నుంచి సేకరించింది మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.