ప్రకృతిలో లభించే ప్రతీ పండు మన ఆరోగ్యానికి ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది.

మన ఆరోగ్యాన్ని రక్షించే పండ్లలో స్ట్రాబేర్రీ ఒకటి. ఒకప్పుడు పట్టణాల్లో మాత్రమే లభించే ఈ పండ్లు ఇప్పుడు గ్రామాలకు కూడా వచ్చేశాయి.

చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఈ పండు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇంతకీ స్ట్రాబెర్రీ క్రమం తప్పకుండా తీసుకుంటే కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కంటి ఆరోగ్యానికి స్ట్రాబెర్రీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ కంటి శుక్లాలను నివారించడంలో ఉపయోగపడతాయి.

 స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి.. ఫ్రీరాడికల్స్ నుంచి కళ్లను కాపాడుతుంది.

స్ట్రాబెర్రీలు గుండెకు ఎంతో మేలు  చేస్తుంది. ముఖ్యంగా గుండెకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తోంది. 

స్ట్రాబెర్రీలో ఉండే పీచు పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాన్ను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. 

ఈ పండులో ఉండే పీచు.. జీర్ణవ్యవస్థను కూడా మెరుగు పరుస్తుంది.

క్రమం తప్పుకుండా స్ట్రాబెర్రీని ఆహారంలో భాగం చేసుకుంటే నోటి సమస్యలను చెక్ పెట్డవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

 స్ట్రాబెర్రీ తీసుకోవడం వలన నోటి క్యాన్సర్ను దూరం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

 స్ట్రాబెర్రీ లోని యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ కీళ్లనొప్పులను తగ్గిస్తాయి.

స్ట్రాబెర్రీలు అల్సర్ని తగ్గించడంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. 

 ఈ పండ్లను నిత్యం తీసుకుంటే ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

మరి ఇన్ని పోషక విలువలు, మంచి గుణాలున్న స్ట్రాబెర్రీలను ఆహారంలో భాగం చేసుకోండి.