ప్రకృతి ఒడిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్న మెుక్కలు ఉన్నాయి. వాటిని మనం సరైన పద్దతిలో ఉపయోగించుకుంటే ఆరోగ్యంగా ఉంటాం.
ఈ ప్రకృతి ఒడిలో లభించే ఔషధగుణాలు ఉన్న మెుక్కల్లో అతి ముఖ్యమైనది తిప్పతీగ. ఈ తీగ మనకు పల్లెటూర్లలో ఎక్కువగా లభిస్తుంది.
ఈ తిప్పతీగ రసం రోజూ తగినంతగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఈ తీగ రసాన్ని రోజూ తాగితే శరీరంలోని షూగర్ లెవల్స్ తో పాటుగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని వారు చెబుతున్నారు.
అయితే ఈ తిప్ప తీగను తీసుకోవాలను కునేవారు కచ్చితంగా ఈ క్రింది విషయాలను తెలుసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తీప్పతీగ రసాన్ని రోజూ ఉదయం పరగడుపునే రెండు టీ స్పూన్లు తీసుకోవాలి. ఈ రసంలో తగినంత నీళ్లు కలిపి తీసుకోవాలి.
2 స్ఫూన్లకంటే ఎక్కువగా తీసుకుంటే తీవ్ర దుష్ఫరిణామాలు తప్పవంటున్నారు వైద్యులు.
ఇక రాత్రి భోజనం చేసిన తర్వాత పావు టీస్ఫూన్ తిప్పతీగ రసానికి 1 టీ స్పూన్ తేనెను కలిపి తీసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే ప్రమాదం.
షుగర్ ఉన్నవారు అర టీస్పూన్ ఈ రసాన్ని రోజూ ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటయాంటున్నారు నిపుణులు.
ఇక ఈ తిప్పతీగ రసాన్ని సర్జరీలు చేయించుకున్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు తీసుకోరాదు.
నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్లను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోండి.