జామ కాయలు అంటే ఇష్టం ఉండని వాళ్లు ఎవరుంటారు చెప్పండి?

పేదవాడికి జామకాయనే యాపిల్‌ అంటారు. జామకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే జామ చెట్టు ఆకులు, పువ్వులు, బెరడుతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

జామ ఆకులను మెత్తగా నూరి ముఖానికి లేపనంగా వాడితూ ఉంటే మొటిమలు తగ్గుతాయి.

జామ ఆకుల కషాయం జుట్టుకు రాయడం ద్వారా జుట్టు సమస్యలు కూడా తీరే అవకాశం ఉంది. 

జామ ఆకులతో చేసిన కషాయం తాగడం వల్ల శరీరంలో కొవ్వు కరిగే అవకాశాం ఉంది.

జామ ఆకుల కషాయం వల్ల రక్తంలో షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌ ఉంటాయంట.

జామ ఆకులను మెత్తగా నూరి అందులో పసుపు కలిపి రాసుకోవడం వల్ల గజ్జి, తామర, ఒరుపులు వంటి చర్మ వ్యాధులు నయమవుతాయి.

జామ ఆకులను మెత్తగా నూరి అందులో చిటికెడు ఉప్పు, అర టీస్పూన్‌ జిలకర కలిపి వేడి నీటితో తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది.

జామ ఆకులకు ఆముందం రాసి వేడి చేసి నెప్పులు ఉన్న దగ్గర కట్టు కడితే ఫలితం

జామ ఆకులను నమలడం వల్ల నోటి పూత, పుండ్లు, చిగుళ్ల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.

 జామచెట్టు బెరడుకు కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయ.

జామచెట్టు బెరడు కషాయం, చూర్ణం తీసుకోవడం వల్ల స్వప్న స్కలనం, వాంతులు, విరేచనాలు, రక్త మొలలు తగ్గే అవకాశం ఉంది.

జామ పువ్వులను మెత్తగా నూరి కళ్లపై పెట్టుకోవడం వల్ల కళ్ల కలక, నీళ్లు కారడం వంటివి తగ్గుతాయి.