ఇంట్లో కొన్ని రకాల వస్తువులు, జీవులు ఉంటే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అవేంటంటే..
పావురాళ్లు మీ ఇంట్లో ఉంటే స్థిరత్వం ఉండదని, సంపద కనిపించదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.
తేనె తుట్టే ఇంట్లో ఉంటే దురదృష్టమని, కరవు తప్పదని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాలెగూడు ఉన్న ఇంటికి తరచూ చెడు జరుగుతూ ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
పగిలిన అద్దం నెగిటివ్ ఎనర్జీకి సంకేతంగా భావిస్తారు.
అందువల్ల పగిలిన అద్దం ఇంట్లో ఉంటే.. పేదరికం తాండవిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నీళ్లు కారే కులాయిలు : కొన్ని ఇళ్లల్లో ట్యాప్‌లు, కుళాయిలనుంచి నీళ్లు ధారగా కారుతూనే ఉంటాయి.
ఇలా ఎప్పుడూ నీళ్లు కారుతుంటే ఇంట్లో డబ్బంతా అయిపోయి.. ఆర్థిక సమస్యలు, కరవులు, కొరతలు మొదలవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
నోట్: ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాశాం. నెటిజన్స్ గమనించగలరు.