టెక్ టాపిక్

స్మార్ట్‌ ఫోన్ల వాడకం పెరిగిపోయిన తర్వాత మన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన భద్రత పూర్తిగా చెయ్యి దాటిపోయింది.

టెక్ టాపిక్

కొందరు వ్యక్తులు మనకు సంబంధించిన విషయాలు మార్కెట్‌లో పెట్టి అమ్మేస్తున్నారు.

టెక్ టాపిక్

కొన్ని సార్లు సైబర్‌ నేరగాళ్లు మనల్ని మోసం చేస్తుంటే.. మరికొన్ని సార్లు మన చేతులారా మనంతకు మనమే మోసపోతున్నాము.

టెక్ టాపిక్

సైబర్‌ నేరాలు జరగటానికి గల ప్రధాన కారణాల్లో ప్రమాదకర వైరస్ కలిగిన ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవటం కూడా ఒకటి.

టెక్ టాపిక్

వాటినే ఇంగ్లీష్‌లో మాలీసియస్‌ యాప్స్‌ అంటారు. ఈ యాప్స్‌ ద్వారా మన వ్యక్తిగత సమాచారం చోరీ చేయబడుతుంది.

టెక్ టాపిక్

అంతేకాదు! ఆ డేటా ద్వారా మన ఫోన్‌ను హ్యాక్‌ చేసి, మన బ్యాంకు ఖాతాల్లోని డబ్బుల్ని కూడా ఈజీగా కొట్టేసే అవకాశం ఉంటుంది.

టెక్ టాపిక్

అందుకే మాలీసియస్‌ యాప్స్‌కు దూరంగా ఉండటం మంచిది.

టెక్ టాపిక్

కానీ, మాలీసియస్‌ యాప్స్‌ను గుర్తించి వాటికి దూరంగా ఉండటం ఎలా?.. దీనికి మనం చేయాల్సిందల్లా.. గూగుల్‌ ప్లే స్టోర్‌లోని యాప్స్‌ను మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

టెక్ టాపిక్

బయటి యాప్స్‌ను అస్సలు వాడకూడదు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే 17 యాప్స్‌ను అస్సలు వాడొద్దు.

టెక్ టాపిక్

ఒక వేళ మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉంటే డిలీట్‌ చేయండి. ఈ యాప్స్‌లో కొన్ని మోసాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాయి.

టెక్ టాపిక్

వీటిని ఫోన్‌ ఎరినా.. మాలీసియస్‌ యాప్స్‌గా గుర్తించింది. వీటిలో కొన్నింటిని గూగుల్‌ ప్లేస్టోర్‌ కూడా తొలగించింది.

టెక్ టాపిక్

వీటిలో మరికొన్ని 50వేల డౌన్‌లోడ్స్‌, 4ప్లస్‌ రేటింగ్‌తో ఉన్నాయి. వీటన్నింటిని చూసి మీరు మోస పోకండి.

టెక్ టాపిక్

ఇప్పుడు చెప్పబోయే యాప్స్‌ గనుక మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి.

టెక్ టాపిక్

డాక్యుమెంట్ మెనేజర్ (Document Manager) కాయిన్ ట్రాక్ లోన్ (Coin Track Loan) కూల్ కాలర్ స్క్రీన్ (Cool Caller Screen) పీఎస్‌డీ ఓత్ ప్రొటెక్టర్ (PSD Auth Protector) ఆర్‌జీబీ ఎమోజీ కీబోర్డ్ (RGB Emoji Keyboard) కెమెరా ట్రాన్స్‌లేటర్ ప్రో (Camera Translator Pro)

టెక్ టాపిక్

ఫాస్ట్ పీడీఎఫ్ స్కానర్ (Fast PDF Scanner) ఎయిర్ బెలూన్ వాల్‌పేపర్ (Air Balloon Wallpaper) కలర్‌ఫుల్ మెసెంజర్ (Colorful Messenger) థగ్ ఫొటో ఎడిటర్ (Thug Photo Editor) యానిమ్ వాల్‌పేపర్ (Anime Wallpaper) పీస్ ఎస్ఎంఎస్ (Peace SMS)

టెక్ టాపిక్

హ్యాపీ ఫొటో కొలేజ్ (Happy Photo Collage) పెలెట్ మెసేజెస్ (Pellet Messages) స్మార్ట్ కీబోర్డ్ (Smart Keyboard) 4కే వాల్‌పేపర్స్ (4K Wallpapers) ఒరిజినల్ మెసేంజర్ (Original Messenger)