మహిళలకు నెలసరి సమయంలో చాలా చిరాకుగా, నరకంగా ఉంటుంది.
విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుంటారు. 30 నుంచి 50 శాతం మంది మహిళలు నెలసరి నొప్పులతో బాధపడుతున్నారు.
ఈ నొప్పు భరించలేక కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. అయితే అవి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెబుతున్నారు.
ఈ ఆహార పదార్థాలతో నెలసరి నొప్పులను, సమస్యలను తగ్గించుకోవచ్చు.
కమలా పండ్లు నెలసరి నొప్పిని తగ్గించడంలో కమలా పండ్లు బాగా ఉపయోగపడతాయి. నారింజ, నిమ్మకాయల్లో కంటే కమలా పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
కమలా పండులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు పీరియడ్ క్రాంప్స్ తగ్గిస్తాయి. నెలసరి నొప్పితో బాధపడుతుంటే గనుక కమలా పండ్లు ఎక్కువగా తినండి.
దాల్చిన చెక్క నెలసరి నొప్పితో బాధపడేవారికి దాల్చిన చెక్క అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ-స్పాస్మోడిక్ గుణాలు నెలసరి నొప్పిని తగ్గించడంలో తోడ్పడతాయి.
నెలసరి సమయంలో కలిగే అధిక రక్తస్రావం, వికారం, వాంతులు, అసౌకర్యం వంటి వాటిని తగ్గించడంలో దాల్చిన చెక్క బాగా పని చేస్తుంది.
నెలసరి సమయంలో నొప్పితో బాధపడేవారు దాల్చిన చెక్క టీ తాగితే రిలీఫ్ అవుతారు.
హాట్ చాక్లెట్ నెలసరి నొప్పిని తగ్గించడంలో హాట్ చాక్లెట్ బాగా పని చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం శరీరానికి శక్తినిస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
డ్రై ఫ్రూట్స్, నట్స్ ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ వంటివి తింటే నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. .
నల్ల ఎండు ద్రాక్షలో ఉండే ఐరన్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో ఉండే టోకోఫెరోల్ పీరియడ్ సైకిల్ ను నియంత్రిస్తుంది
అల్లం నెలసరి సమయంలో అల్లం తినడం వల్ల పీరియడ్స్ లో వచ్చే నొప్పి తగ్గుతుంది. ఇది అసౌకర్యాన్ని కలిగించే ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
క్రమం తప్పిన పీరియడ్స్ ను, రెగ్యులర్ చేయడంలో అల్లం బాగా పని చేస్తుంది. ఇది ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ కారణంగా వచ్చే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
ఆకుకూరలు ఆకుకూరల్లో ఉండే ఐరన్, మెగ్నీషియం, కాల్షియం పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తాయి. శరీరానికి శక్తిని అందజేస్తాయి. జీర్ణక్రియను వేగవంతం చేసి.. అలసటను దూరం చేస్తాయి.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో సేకరించింది మాత్రమే. అవగాహన కోసం వైద్యులను, నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.