డెంగ్యూ వచ్చిందంటే అంత త్వరగా వదిలిపెట్టదు. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

రక్తంలో ప్లేట్లెట్లని పడిపోయేలా చేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పండ్లతో డెంగ్యూ నుంచి కోలుకోవచ్చు.   

దానిమ్మలో ఐరన్ అధికంగా ఉంటుంది. డెంగ్యూ రోగులు త్వరగా కోలుకునేందుకు దానిమ్మ పండ్లు బాగా తోడ్పడతాయి. 

ఈ పండ్లను తినడం వల్ల బ్లడ్ ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవచ్చు.

డెంగ్యూ రోగుల్లో అలసట రావడం అనేది సాధారణంగా వస్తుంది. అయితే ఇది ముదిరితే డెంగ్యూ నుంచి కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. దానిమ్మ పండ్లు తింటే అలసట తగ్గుతుంది.

కివీ పండ్లు డెంగ్యూ లక్షణాలను తగ్గించడంలో బాగా పని చేస్తాయి. కివీ పండ్లలో ఉండే రాగి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. 

కివీల్లో ఉండే విటమిన్ ఈ, పొటాషియం, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి.  

కివీ పండ్లు శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడతాయి. వీటిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డెంగ్యూకి వ్యతిరేకంగా పోరాడడంలో విటమిన్ సి బాగా పని చేస్తుంది.

నారింజ పండ్లు తినడం వల్ల డెంగ్యూ రోగులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి.

డెంగ్యూ వల్ల రోగుల శరీరం డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. బాగా అలసిపోతారు. నారింజ పండ్లు తినడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.      

నారింజ పండ్లు డెంగ్యూ రోగుల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అన్నం తినే ముందు ఒక కప్పు నారింజ రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బొప్పాయి పండ్లు జీర్ణక్రియకు బాగా ఉపయోగపడతాయి. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో బొప్పాయి బాగా పని చేస్తుంది.

బొప్పాయి ఆకులు డెంగ్యూతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. డెంగ్యూని తగ్గించడానికి బొప్పాయి ఆకులు బాగా ఉపయోగపడతాయి.

30 మి.లీ. బొప్పాయి ఆకుల రసం తాగితే ప్లేట్లెట్ల సంఖ్య బాగా పెరుగుతుంది. దీంతో డెంగ్యూ త్వరగా తగ్గిపోతుంది.

కొబ్బరి నీళ్లు కూడా డెంగ్యూ రోగులకు మంచిది. కొబ్బరి నీళ్లలో ఉండే ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు డెంగ్యూ వ్యాధిని కంట్రోల్ చేస్తాయి.

శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కొబ్బరి నీళ్లు సహకరిస్తాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.   

డ్రాగన్ పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. డెంగ్యూ జ్వరం నుంచి కాపాడతాయి.

డెంగ్యూ వల్ల ఎముకల్లో కలిగే నొప్పిని తగ్గించడానికి, ఎముకలను బలంగా ఉంచడానికి డ్రాగన్ పండ్లు బాగా పనిచేస్తాయి.

డ్రాగన్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హిమోగ్లోబిన్ ను పెంచడంలో తోడ్పడుతుంది.  

అరటి పండ్లు శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడమే కాకుండా సులువుగా జీర్ణమవుతాయి

అరటి పండ్లలో ఉండే విటమిన్స్ సి, విటమిన్ బి6, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడానికి బూస్టర్ లా పని చేస్తాయి.  

గమనిక: ఈ టిప్స్ ఫాలో అయ్యే ముందు నిపుణులను, వైద్యులను సంప్రదించవలసిందిగా మనవి.