ఇటీవల కాలంలో ప్రతి ఐదుగురిలో ఇద్దరిని వేధిస్తున్న సమస్య థైరాయిడ్. అసలేంటీ థైరాయిడ్..ఎందుకు వస్తుందంటే..?
థైరాయిడ్ అనేది ఒక గ్రంధి. ఇది శరీరం ఎదుగుదలకు ఎంతో సహాయ పడటంతో పాటు జీవక్రియలో కీలకపాత్ర వహిస్తుంది.
శరీర ఉష్ణోగ్రత, మానసిక స్థితి, గుండె స్పందన రేటు, రక్తపోటును నియంత్రిస్తుంది
ఈ థైరాయిడ్ సీతాకోకచిలుక ఆకారంలో కంఠం వద్ద ఉంటుంది. ఈ గ్రంధిలో ఎటువంటి మార్పులు రానంతవరకు సమస్యలు ఉండవు కానీ
ఈ థైరాయిడ్ గ్రంధి పనితీరులో మార్పులు జరిగితే.. వెంటనే శరీరంలో మార్పులు వచ్చేస్తుంటాయి
బరువు పెరగడంతో పాటు తగ్గడం, అలసట సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఒళ్లంతా చెమటలు పట్టడం, వేడికి శరీరం తట్టుకోలేకపోవడం, వణుకు, ఆందోళన, బరువు తగ్గిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, నెలసరి క్రమంగా లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
ఈ సమస్యతో బాధపడేవారు.. పలు ఆహార పదార్థాలను తీసుకోలేరు. తీసుకుంటే పలు సమస్యలు ఎదుర్కొక తప్పదు.
దీని బారిన పడిన వారు.. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం
ఉసిరికాయ థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉసిరిలో నారింజ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ విటమిన్ సి దానిమ్మ పండ్లు కంటే 17 రెట్లు ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటుంది.
ఇది జుట్టు ఆరోగ్యంతో పాటు థైరాయిడ్ పనితీరు మెరుగుపరుస్తుంది
అలాగే పెసలు.. ఇందులో పీచు, అయోడిన్ ,జింక్ సమృద్ధిగా ఉంటుంది.
గుమ్మడి గింజలు.. రోజుకు ఒక ఔన్స్ ఎండిన గుమ్మడికాయ గింజలు తింటే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన జింక్ రోజు శరీరానికి లభిస్తున్నట్లే.
సీట్స్, నట్స్ వంటివి తీసుకోవాలి. బీన్స్, చిక్కుళ్ల వంటి ప్రొటీన్ పదార్థాలు తీసుకోవాలి
పెరుగు.. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. గ్రంధి పనితీరును మెరుగుపరిచి అయోడిన్ అవసరాలను తీరుస్తుంది.
కొబ్బరి.. ఇందులోని చైన్ ఫ్యాటీ యాసిడ్స్ సమతుల్య జీవక్రియలో సాయం చేస్తుంది.