ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని నానుడి.

ఉల్లితో లెక్కలేనన్ని లాభాలు ఉంటాయని ఆ నానుడి అర్థం. 

ఉల్లిపాయల పొట్టు దగ్గరినుంచి తొక్కల వరకు అన్నీ అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. 

పచ్చిగా తిన్నా.. వంటల్లో వాడుకున్నా.. చివరకు పొడి చేసుకుని వాడినా లాభాలు ఉంటాయి. అవేంటంటే..

అన్నం వండేటప్పుడు ఉల్లిపాయ తొక్కల పొడిని వేయటం కారణంగా శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.

చపాతీల పిండి కలిపేటప్పుడు ఉల్లి పొడిని కొంచెం కలిపితే కొత్త రుచి వస్తుంది.

రొయ్యల ఇగురు, చేపల ఇగురు, బంగాళాదుంప ఇగురు లాంటి వాటిలో ఉల్లి పొడి వాడితే మంచిగా గ్రేవీ వస్తుంది.

ఉల్లి పొడితో టీ చేసుకుని తాగటం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. 

ఉల్లి టీ కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఉల్లిపాయలు తొక్కల పొడిని నీటిలో కలుపుకుని కూడా తాగొచ్చు. 

ఇలా చేస్తే విటమిన్ ఎ శరీరానికి అందుతుంది. విటమిన్ ఎ కంటి చూపునకు ఎంతో మేలు చేస్తుంది.

ఉల్లిలోని విటమిన్ సి, ఇ లు కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఉల్లి నీటితో కండరాల తిమ్మిరి తగ్గుతుందని, కండరాలు ఫ్లెక్సిబుల్గా మారతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.