సంపాదించడం వల్లే ధనవంతులు కాదు. సంపాదించిన దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియాలి.

ఆదాయంతో పాటు ఖర్చు, పొదుపు, పెట్టుబడులు గురించి తెలిసి ఉండాలి. కొత్త ఏడాది రాబోతున్న సందర్భంగా అలాంటి టిప్స్ మీ కోసం..

సమృద్ధి: మీరు సంపాదిస్తున్న దాంతో సంతృప్తి చెందడం మంచిదే. కానీ అంతటితో ఆగిపోకండి.. ఇప్పటికే చాలా సంపాదించేశా అని.. సంపాదించడం ఆపేయకండి.

మీ దగ్గరున్న డబ్బు ఇప్పటి మీ అవసరాలు తీర్చచ్చు. కానీ సమృద్ధికి ప్రయత్నించండి. దీనివల్ల భవిష్యత్తులో మీరు ఎవరిపై ఆధారపడకుండా బతకొచ్చు.

అనేక మార్గాలు: డబ్బు సంపాదనకు చాలా మార్గాలు. అందుకే సంపాదించిన దాన్ని వేరే వేరే మార్గాల్లో మదుపు చేయడం ద్వారా.. వాటినుంచి ఆదాయం వస్తుంది.

ఇది మీకు ఒకే సంపాదనలా కాకుండా.. ఆదాయ మార్గాలను పెంచుతుంది. దీనికి తగ్గట్టుగా ఇన్వెస్ట్ మెంట్స్ ప్లాన్ చేసుకోండి.

పోల్చుకోకండి: మిగతా వారి సంపాదనతో మీ సంపాదనను ఎప్పుడూ పోల్చుకోకండి. దీనివల్ల ఫీల్ కావడం తప్పించి పెద్దగా ప్రయోజనం ఉండదు.

కొత్త వస్తువులు: ప్రతిరోజూ మార్కెట్లో ఏదో ఓ కొత్త వస్తువు వస్తూనే ఉంటుంది. రకరకాల గాడ్జెట్లు అందుబాటులో ఉంటున్నాయి.

నమ్మకం: డబ్బుల విషయంలో, పెట్టుబడుల విషయంలో అంత తొందగా ఎవ్వరినీ నమ్మకండి.

ఆర్థిక భాగస్వామిగా మారేముందు, దేంట్లోనైనా పెట్టుబడులు పెట్టేముందు.. స్వయంగా మీరే దాని గురించి పూర్తి అవగాహన కల్పించుకోండి. ఆ తరువాతే అందులోకి దిగండి.

పెట్టుబడులు: పొదుపు చేయడం వల్ల ధనవంతులు కావడం అందరికీ తెలిసిందే. కానీ సరైన సమయంలో, సరైన దాంట్లో పెట్టుబడులు పెట్టాలి.

దీని వల్ల మీ భవిష్యత్తులో అవసరాలకు తగ్గట్టుగా అవి మిమ్మల్ని ఆదుకుంటాయి. అది తెలుసుకుని పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

రుణాలు: చేసిన అప్పులు, లోన్లు వీలైనంత త్వరగా తీర్చడానికి ప్రయత్నించండి. లేకపోతే జీవితకాలం లోన్లు కట్టడంలోనే సరిపోతుంది.

ప్రదర్శన వద్దు: మీరు ధనవంతులని నలుగురూ అనుకోవాలని.. ఉన్నా, లేకున్నా చూపించుకోవాలనుకోవడం సరికాదు.

దీనికోసం చాలామంది అవసరం ఉన్నా, లేకున్నా ఖరీధైన వస్తువులు, గాడ్జెట్స్, వాహనాలు కొంటుంటారు. దీనివల్ల మీ జేబుకు చిల్లు పడడం తప్ప వేరే ఉపయోగం లేదు.

ఖర్చు: మీ సంపాదనను మించి మీ ఖర్చు ఉందా? పరిశీలించండి. అలా ఉన్నట్లయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే.. మీ ఆర్థిక స్థితి గందరగోళంలో ఉన్నట్లే.

నోట్: మాకు అందుబాటులోని సమాచారం ఆధారంగా పైన పాయింట్స్ చెప్పాం. నెటిజన్స్ గమనించగలరు!