ఇంట్లో వాడే సుగంధ ద్రవ్యాల్లో యాలకులు కూడా ఒకటి. మన దేశంలో చాలా వంటల్లో దీనిని ఉపయోగిస్తారు.
మంచి వాసనతో ఉండే యాలకులని వంటల్లో ఉపయోగించడం వల్ల రెసిపీ రుచి మరింతగా పెరుగుతుంది.
అయితే రుచిలోనే కాదు.. యాలకులు చాలా ఔషద గుణాల్ని కూడా కలిగి ఉన్నాయి. చాలా అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాయి.
ప్రతిరోజూ రెండు యాలకులని ఉదయం పరగడుపున, రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో తీసుకుంటే ఇక మీరు మందులు వాడాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఇదే ప్రొసీజెర్ లో యాలకులని తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి కూడా ఈజీగా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
తిన్న ఫుడ్ జీర్ణం కావట్లేదని.. అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలు వేధిస్తున్నా సరే యాలకులని ఇలా తీసుకుంటే.. చక్కటి ఫలితం ఉంటుంది.
రాత్రిపూట యాలకులను గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల డిప్రెషన్ తగ్గడంతో పాటు ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
మూత్రాశయ సమస్యలతో బాధపడే వారు ఉదయం పూట యాలకులు తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు, మూత్రంలో మంట
ఇన్ఫెక్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
రక్తహీనత సమస్యని తొలగించే పోషకాలు, యాలకుల్లో ఎక్కువగా ఉంటాయి.
వీటిని పైన చెప్పిన విధంగా తీసుకోవడం వల్ల.. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు.
దంత సమస్యలని నయం చేయడంలోనూ యాలకులు మనకు సహాయపడతాయి.
యాలకులు నమిలి, గోరువెచ్చని నీరు తాగడం వల్ల పళ్ల ప్రాబ్లమ్ క్లియర్ అవుతాయి.
యాలకులు, దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి మిశ్రమాన్ని నోటిలో వేసుకుని పుక్కిలించడం వల్ల గొంతు సమస్యలు తగ్గిపోతాయి.
యాలకులని ఇలా ఉపయోగించడం వల్ల పైన చెప్పిన సమస్యలు తగ్గడమే కాదు భవిష్యత్తులోనూ రాకుండా ఉంటాయి.
నోట్: పైన టిప్స్ పాటించేముందు.. మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.