బంగారం డిమాండ్ అనేది ఎప్పుడూ ఉండేదే.

ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా కూడా డిమాండ్ అనేది అలానే ఉంటుంది.

బంగారం కొనడం అంటే పెట్టుబడి పెట్టడంతో సమానం.

అయితే బంగారు ఆభరణాలు కొనడం కంటే ఫిజికల్ గోల్డ్ కాయిన్స్ కొనడం మంచిదని ఎకనామిస్ట్, స్టాక్ మార్కెట్ నిపుణులు జీవీ రావు చెబుతున్నారు.

నెల నెలా ఒక గ్రాము గోల్డ్ కొనడం వల్ల అనేక లాభాలు ఉంటాయని చెబుతున్నారు.

బంగారంతో పోలిస్తే గోల్డ్ కాయిన్స్ కి రీసేల్ విలువ ఉంటుంది.

ఆభరణాలు కొనడం వల్ల తయారీ ఛార్జీలు, వేస్టేజ్ అనేవి ఉంటాయి. కానీ గోల్డ్ కాయిన్స్ కి అలాంటివి ఏమీ ఉండవు.

గోల్డ్ కాయిన్స్ మీద పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయని చెబుతున్నారు.

ప్రతి నెలా క్రమం తప్పకుండా కనీసం ఒక గ్రాము బంగారం నాణం చొప్పున కొనుక్కుంటూ వెళ్తే ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు.

ఆదాయం పెరిగితే కనుక 2 గ్రాములు, 3 గ్రాములు, 5 గ్రాములు చొప్పున పెంచుకుంటూ వెళ్తే ఒకానొక సమయం వచ్చేసరికి చాలా విలువైన బంగారం పోగవుతుందని అంటున్నారు.

ఏడాదికి కనీసం 12 గ్రాముల చొప్పున 40 ఏళ్లలో 480 గ్రాములు పోగవుతాయని.. పదవీ విరమణ సమయంలో 2 గ్రాముల చొప్పున అమ్ముకున్నా పెన్షన్ లా డబ్బు వస్తుందని చెబుతున్నారు.  

గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఆభరణాలుగా కూడా చేయించుకోవచ్చు.

30వ ఏట నుంచి నెలకు ఒక గ్రాము చొప్పున 30 ఏళ్ల పాటు గోల్డ్ కాయిన్ కొంటూ ఉంటే రిటైర్మెంట్ వయసు వచ్చేసరికి 360 గోల్డ్ కాయిన్స్ అవుతాయి.

30 ఏళ్ల తర్వాత దాని విలువ భారీగా పెరుగుతుందని అంటున్నారు.