అక్షయ తృతీయ పర్వదినం రోజున బంగారం కొంటే విపరీతంగా కలిసి వస్తుందని జనాలు బలంగా నమ్ముతారు.
గత కొన్నాళ్లుగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనే వారి సంఖ్య పెరుగుతుంది.
అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే కలిసి వస్తుందనే నమ్మకంతో చాలా మంది.. అప్పు చేసి మరీ బంగారం కొంటున్నారు.
చేతిలో డబ్బులు ఉండి.. అత్యవసర ఖర్చులు ఏం లేకపోతే.. బంగారం కొనడం ఉత్తమం.
కానీ తోటి వాళ్లు కొంటున్నారని చెప్పి.. మన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి బంగారం కొనడం అనేది తప్పు.
ఇక చాలా మంది క్రెడిట్ కార్డు మీద బంగారం కొంటున్నారు.
నేటి కాలంలో క్రెడిట్ కార్డ్ వాడి ఇబ్బడి ముబ్బడిగా షాపింగ్ గట్రా చేస్తున్నారు.
అసలు బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం అత్యవసర సమయంలో.. చేతిలో రూపాయి లేని పరిస్థితుల్లో మాత్రమే క్రెడిట్ కార్డు వాడాలి.
అలా వాడుకున్న మొత్తాన్ని.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెల్లించాలి అని సూచిస్తారు.
ఇక క్రెడిట్ కార్డు మీద బంగారం కొనాలనే ఆలోచన మంచిది కాదు అంటున్నారు నిపుణుల.
ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా వెంటనే చెల్లించడం ఉత్తమం అంటున్నారు.
క్రెడిట్ కార్డు మీద బంగారం కొనడం అంటే అప్పు చేసి కొన్నట్లే.
ఒకేసారి కాకుండా.. విడతల వారీగా ఈఎంఐల రూపంలో కడతాం అంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది.
ఎందుకంటే బయట అప్పు చేస్తే ఇంట్రెస్ట్ రేట్ కాస్త తక్కువగానే ఉంటుంది.
కానీ క్రెడిట్ కార్డ్ మీద మాత్రం ఇంట్రెస్ట్ రేట్ 18-30 శాతం వరకు ఉంటుంది.
ప్రతి నెలా ఈ భారం పెరుగుతుంది కనుక.. క్రెడిట కార్డ్ మీద బంగారం కొనుగోలు చేయకపోవడం ఉత్తమం అంటున్నారు.
మరి చేతిలో ఒకేసారి పెద్ద మొత్తం ఉండదు.. బంగారం కొనాలంటే మార్గం ఏంటి అంటే..
ఇందుకు సిప్ పద్దతి ఉత్తమం అంటున్నారు మార్కెట్ నిపుణులు.
ప్రతి నెల ఫిక్స్‌డ్ ఎమౌంట్ పొదుపు చేస్తూ.. మెచ్చురిటీ తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయవచ్చు.
మరో మార్గం.. డిటిజల గోల్డ్. రూపాయితో కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు.
ఇది డిజిటల్ వ్యాలెట్‌లో భద్రంగా ఉంటుంది. మీ దగ్గర సరిపడా నిధులు ఉన్నప్పుడు ఈ బంగారాన్ని కాయిన్ రూపంలో ఇంటి వద్దకే హోం డెలివరీ పొందవచ్చు అంటున్నారు నిపుణులు.